ICC Chairman : జై షా ఐసీసీ కొత్త ఛైర్మన్ అవుతారో.. లేదో.. తేలేది అప్పుడే..

ప్రస్తుత ICC ఛైర్మన్ గ్రెగ్ బార్ల్కే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుండ‌డంతో మంగళవారం రేసు నుండి వైదొలిగారు.

Update: 2024-08-21 04:08 GMT

ప్రస్తుత ICC ఛైర్మన్ గ్రెగ్ బార్ల్కే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుండ‌డంతో మంగళవారం రేసు నుండి వైదొలిగారు. ఈ ప‌రిణామం గ్లోబల్ బాడీలోకి BCCI కార్యదర్శి జే షా ఎంట్రీ ఇస్తార‌నే ఊహాగానాలకు దారితీసింది. ICC ఛైర్మన్ పదవికి జే షా పోటీలో ఉంటారా లేదా అనేది ఆగస్టు 27 నాటికి స్పష్టమవుతుంది. ఆగస్టు 27 ఐసీసీ చైర్మన్ పదవికి నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ.

ఐసీసీ ఛైర్మన్ ప‌ద‌వీ కాలం రెండేళ్లు కాగా.. ఒక‌రు గ‌రిష్ఠంగా మూడు ప‌ర్యాయాలు ఈ ప‌ద‌విలో కొసాగ‌వ‌చ్చు. ప్రస్తుత ICC ఛైర్మన్ గ్రెగ్ బార్ల్కే ఇప్పటికి నాలుగు సంవత్సరాలు ప‌ద‌వీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఛైర్మన్ ఎన్నికలో 16 ఓట్లు ఉన్నాయి. విజేతకు తొమ్మిది ఓట్ల సాధారణ మెజారిటీ (51%) అవసరం. ఇంతకుముందు చైర్మన్‌గా ఉండాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి. గ‌త కొన్ని నెలలుగా ఊహాగానాలు వెలువ‌డుతున్న‌ప్ప‌టికీ.. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో జే షా పోటీపై తీవ్ర‌మైన చ‌ర్చ జ‌రుగుతుంది.

Tags:    

Similar News