India Vs Bangladesh : ష‌మీకి నో ప్లేస్‌.. ఓవ‌ర్లో ఐదు సిక్స్‌లు బాదిచ్చుకున్న బౌల‌ర్‌కు జ‌ట్టులో చోటు

బంగ్లాదేశ్‌తో సెప్టెంబర్ 19న ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్ కోసం ఆదివారం 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు

Update: 2024-09-09 02:20 GMT

బంగ్లాదేశ్‌తో సెప్టెంబర్ 19న ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్ కోసం ఆదివారం 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. ఇందులో వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ 20 నెలల తర్వాత టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు దూరమైన స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. పంత్ 2022 డిసెంబర్ 22 నుండి 25 వరకూ బంగ్లాదేశ్‌తో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తరువాత డిసెంబర్ 30న పంత్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ఆ త‌ర్వాత‌ ఈ సంవత్సరమే కోలుకుని అతడు IPLలో కూడా ఆడాడు. జూన్‌లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో పంత్ కూడా సభ్యుడు.

యూపీ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. అయితే మహ్మద్ షమీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో జరగనుంది. రెండో టెస్టు కాన్పూర్‌లో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనుంది.

తొలి టెస్టు మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ధ్రువ్ జురైల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్‌దీప్, జస్ప్రీత్ బుమ్రా, యష్ దయాల్.

Tags:    

Similar News