Dinesh Karthik : టీ20 క్రికెట్‌లోకి దినేష్ కార్తీక్ పునరాగమనం..!

వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Update: 2024-08-28 04:17 GMT

వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే కార్తీక్ ఇప్పుడు లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC)లో ఆడబోతున్నాడు. మంగళవారం అతడు అధికారికంగా లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో చేరాడు. దినేష్ కార్తీక్ ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కోచ్ కూడా. ఇది కాకుండా అతడు ది హండ్రెడ్‌లో వ్యాఖ్యాత వ్య‌వ‌హ‌రించాడు. ఇటీవల శిఖర్ ధావన్ కూడా అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అతడు కూడా లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో చేరాడు.

లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో చేరడంపై దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. “లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఆడటం అనేది.. నా రిటైర్మెంట్ తర్వాత నేను మానసికంగా, శారీరకంగా పని చేయడానికి ఎదురు చూడ‌టం వ‌ల్ల తీసుకున్న నిర్ణ‌యం. ముఖ్యంగా మద్దతు ఇస్తున్నందుకు అభిమానులకు ధన్యవాదాలు.. నేను మరోసారి మైదానంలో మిమ్మల్ని అలరించడానికి ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు.

లెజెండ్స్ లీగ్ క్రికెట్ సహ-వ్యవస్థాపకుడు రామన్ రహేజా మాట్లాడుతూ.. “దినేష్ కార్తీక్ మాతో చేరడం పట్ల మేము చాలా సంతోషిస్తున్నాము.. మ్యాచ్‌లను పూర్తి చేయడం, అభిమానులను అలరించడం కోసం మేము ఎదురుచూస్తున్నాము.. ఇతర క్రికెట్ లెజెండ్స్‌తో కలిసి కార్తిక్ అభిమానుల‌ను అల‌రించాల‌ని ఎదురు చూస్తున్నాడని చెప్పాడు. 

Tags:    

Similar News