Pakistan Captain: భారత్, అమెరికా మ్యాచుల్లో తప్పులు చేశాం: బాబర్

By :  Eha Tv
Update: 2024-06-17 04:00 GMT

ఐర్లాండ్‌పై మూడు వికెట్ల తేడాతో గెలిచి T20 ప్రపంచ కప్‌కు వీడ్కోలు పలికింది పాకిస్థాన్ జట్టు. గ్రూప్ A లీగ్ మ్యాచ్‌లలో భారతదేశం, USAపై ఓడిపోయింది పాకిస్థాన్. ఈ మ్యాచ్ లలో తమ జట్టు తప్పులు చేసిందని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఒప్పుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ జట్టు ఇప్పటికే నిష్క్రమించింది. గ్రూప్-ఏలో టీమిండియా, ఆతిథ్య అమెరికా జట్లు సూపర్-8 దశకు అర్హత సాధించాయి.

ఐర్లాండ్ తో ఫ్లోరిడాలో మ్యాచ్ లో పాక్ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 106 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో గారెత్ డెలానీ 31, జాషువా లిటిల్ 22 పరుగులు చేశారు. టాపార్డర్ లో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 3, ఇమాద్ వాసిం 3, మహ్మద్ అమీర్ 2, హరీస్ రవూఫ్ 1 వికెట్ తీశారు. అతి కష్టం మీద పాక్ జట్టు లక్ష్యాన్ని చేరుకోగలిగింది. బాబర్ ఆజం బ్యాట్ తో రాణించాడు. 32 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
పాక్ జట్టు నిష్క్రమణ ఏ ఒక్కరి వల్లనో జరగలేదని బాబర్ తెలిపాడు. ఓ టీంగానే మేము విజయాలు, ఓటములు ఎదుర్కొంటామని.. నేను కెప్టెన్‌ కదా అని మీరు అంటున్నారు. కానీ ప్రతి క్రీడాకారుడి ఆట నేను ఆడలేను. టీంలో 11 మంది ఉంటారు. ప్రతి ఒక్కరికీ ఓ బాధ్యత ఉంది. మేము ఓ జట్టులాగా కలిసికట్టుగా ఆడలేకపోయాము. ఈ విషయాన్ని అంగీకరించకతప్పదని అన్నాడు బాబర్. మంచి టీం, అనుభవం ఉన్నా మేము ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని.. ఒక కెప్టెన్ గా నేను ఏ ఒక్కరినీ వేలెత్తి చూపించలేను. మా అందరిదీ తప్పేనని బాబర్ అన్నాడు. ప్రపంచకప్‌లో ఏం జరిగిందనేది నేను పాక్ క్రికెట్ బోర్డుకు వివరిస్తా.. కెప్టెన్సీ వదులుకోవాల్సి వస్తే ఆ విషయాన్ని బహిరంగంగానే చెబుతా.. ఏం జరిగినా పబ్లిక్‌గానే జరుగుతుందన్నాడు బాబర్.


Tags:    

Similar News