రోహిత్ శర్మ వల్లే మాకీ గతి: న్యూజిలాండ్
రోహిత్ శర్మ వల్లే మాకీ గతి: న్యూజిలాండ్
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఓడిపోవడంపై న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ స్పందించారు. బ్యాటింగ్‌లో 20రన్స్ తక్కువగా చేశామని, ఆపై రోహిత్ అసాధారణ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నారని తెలిపారు. హిట్‌మ్యాన్ బ్యాటింగే రెండు టీమ్‌ల మధ్య తేడా అన్నారు. బలమైన జట్టు చేతిలోనే ఓడిపోయామని వివరించారు. తమ జట్టు మంచి క్రికెట్ ఆడి భారత్‌కు గట్టి పోటీ ఇచ్చిందని చెప్పారు. ఈ ఓటమి చేదు, తీపితో కూడుకున్నదని శాంట్నర్ తెలిపారు. కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌పై భారత్ గెలిచిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్‌లో ఇండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది . న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి 2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. రోహిత్ శర్మ గెలుపు ఇన్నింగ్స్ ఆడాడు. . రోహిత్ శర్మ కెప్టెన్సీలో, భారత జట్టు 9 నెలల్లో రెండో ట్రోఫీని అందుకుంది. 2024 టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలిచిన తర్వాత, రోహిత్ కెప్టెన్సీలో టీం ఇండియా 12 సంవత్సరాల తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. మార్చి 9వ తేదీ ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో, అద్భుతమైన బౌలింగ్, కెప్టెన్ రోహిత్ శర్మ బలమైన ఇన్నింగ్స్ సహాయంతో టీమ్ ఇండియా న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో, 25 ఏళ్ల క్రితం ఇదే టోర్నమెంట్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమికి టీం ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. దీనితో పాటు, ఈ ట్రోఫీని గరిష్టంగా గెలుచుకున్న రికార్డును కూడా భారత్ సృష్టించింది.