Pakistan Abrar Ahmed : భారత్-పాక్ మ్యాచ్ తర్వాత విపరీతంగా ట్రోల్ అవుతున్న పాక్ ఆటగాడు..!
పాకిస్థాన్‌కు చెందిన అబ్రార్ అహ్మద్ శుభ్‌మాన్ గిల్‌ను ఔట్ చేసిన తర్వాత తన ప్రవర్తించిన తీరుతో విపరీతంగా ట్రోల్ అవుతున్నాడు.

పాకిస్థాన్‌కు చెందిన అబ్రార్ అహ్మద్ శుభ్‌మాన్ గిల్‌ను ఔట్ చేసిన తర్వాత తన ప్రవర్తించిన తీరుతో విపరీతంగా ట్రోల్ అవుతున్నాడు. ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై తన జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ X లో ట్రోల్ అవుతున్నాడు. హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్‌లో శుబ్మాన్ గిల్‌ను ఎగతాళి చేయడంతో లెగ్ స్పిన్నర్ ఈ ట్రోల్‌ను ఎదుర్కొంటున్నాడు. 46 పరుగుల వద్ద గిల్‌ను అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో భారత వైస్ కెప్టెన్ గిల్ పెవిలియన్‌కు వెళ్తున్నాడు. ఈ సందర్భంగా అబ్రార్ అహ్మద్ గిల్ వైపు చూస్తూ బయటకువెళ్లిపో అని అర్థం వచ్చేలా సంజ్ఞలు చేయడం ప్రారంభించాడు. దీంతో భారత క్రికెట్ అభిమానులు అబ్రార్ ప్రవర్తనకు వ్యతిరేకంగా ట్రోల్ చేశారు.2022 డిసెంబర్లో ముల్తాన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో అహ్మద్ పాకిస్థాన్ తరఫున అరంగేట్రం చేశాడు. అప్పటి నుండి అతను 10 టెస్టులు, 9 ODIలు, 7 T20Iలు ఆడాడు మరియు మూడు ఫార్మాట్లలో 60 వికెట్లు తీసుకున్నాడు.
