Mohammed Siraj : నేడు హైదరాబాద్‌కు సిరాజ్.. విజయోత్సవ ర్యాలీ కూడా ఉంది..!
భారత క్రికెట్ జట్టు ఇటీవల T20 ప్రపంచ కప్ విజయాన్ని పురస్కరించుకుని ఈరోజు హైదరాబాద్‌లో జరిగే విజయోత్సవ ర్యాలీలో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను సన్మానించనున్నారు
భారత క్రికెట్ జట్టు ఇటీవల T20 ప్రపంచ కప్ విజయాన్ని పురస్కరించుకుని ఈరోజు హైదరాబాద్‌లో జరిగే విజయోత్సవ ర్యాలీలో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను సన్మానించనున్నారు. భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ విజయాన్ని పురస్కరించుకుని ముంబైలో బీసీసీఐ గురువారం ర్యాలీని నిర్వహించింది.
ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో కూడా విజయోత్సవ ర్యాలీ జరగనుంది. మెహదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రి నుండి ప్రారంభమయ్యే విజయోత్సవ ర్యాలీ వివరాలను సిరాజ్ పంచుకున్నాడు. వివరాల ప్రకారం.. సాయంత్రం 6:30 గంటలకు మెహిదీపట్నం నుంచి ప్రారంభమై ఈద్గా మైదానంలో ముగుస్తుంది.
ఇటీవల T20 ప్రపంచ కప్‌లో టీమిండియాకు ఆడిన హైదరాబాద్‌కు చెందిన ఏకైక క్రికెటర్ మహ్మద్ సిరాజ్. సిరాజ్‌కు హైదరాబాద్‌లో గణనీయమైన అభిమానుల ఫాలోయింగ్ ఉన్నందున విజయోత్సవ ర్యాలీ భారీగా జరుగనుంది.
సిరాజ్ ఇతర జట్టు సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. ప్రధానిని కలిసిన తరువాత సిరాజ్ తన X హ్యాండిల్‌లో ఫోటోను షేర్ చేసి ఇలా వ్రాశాడు. “ఒక గొప్ప క్షణం.. మీ మంచి మాటలకు.. ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు సర్. భారతదేశ పతాకం ఇలా రెపరెపలాడటానికి కృషి చేస్తూనే ఉంటాం. జై హింద్ అని రాసుకొచ్చాడు.