భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) తన భార్యతో విడాకులు తీసుకున్నాడు.

భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. చాహల్, అతని భార్య ధనశ్రీవర్మ(Dhanashree Verma)కు బాంబే హైకోర్టులో(Mumbai high Court) ఊరట లభించింది. చాహల్, ధనశ్రీ విడాకులకు ఆరు నెలల గడువును హైకోర్టు రద్దు చేసింది. విడాకుల పిటిషన్‌పై గురువారం నాటికి నిర్ణయం తీసుకోవాలని కుటుంబ న్యాయస్థానాన్ని ఆదేశించింది. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నందున విరామ సమయాన్ని రద్దు చేయాలన్న చాహల్, ధనశ్రీ పిటిషన్‌పై హైకోర్టు ఈమేరకు తీర్పు వెల్లడించింది. ధనశ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ అంగీకరించినట్లు తెలుస్తోంది. గతంలో తనకు రూ.60 కోట్ల భరణం చెల్లించాలని ధనశ్రీవర్మ కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, రేడియో జాకీ మహ్‌వశ్(RJ Mahvash) డేటింగ్‌లో ఉన్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దుబాయ్(Dubai)లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను మహ్‌వశ్, చాహల్ కలిసి చూశారు. మ్యాచ్‌కు ముందు ఓ సెల్ఫీ వీడియో, ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు.
