Asia Cup T20 : భార‌త్ విజ‌యం.. తాను బ్యాటింగ్‌కు ఎందుకో రాలేదో చెప్పిన స్మృతి మంధాన

మహిళల ఆసియా కప్ 2024లో మంగళవారం నేపాల్‌పై గెలిచి భారత్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది.

By :  Eha Tv
Update: 2024-07-24 03:09 GMT

మహిళల ఆసియా కప్ 2024లో మంగళవారం నేపాల్‌పై గెలిచి భారత్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. దీంతో భారత జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మ్యాచ్ అనంతరం ఈ మ్యాచ్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న స్మృతి మంధాన ఓ పెద్ద ప్రకటన చేసింది. నేపాల్‌పై బ్యాటింగ్‌ ప్రారంభించేందుకు తాను ఎందుకు బయటకు రాలేదో చెప్పింది.

స్మృతి మంధాన నాయకత్వంలో భారత జట్టు ఈ మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్‌కు విశ్రాంతినిచ్చారు. మంధాన నాయకత్వంలో భారత క్రీడాకారులు పటిష్ట ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్‌లో మంధాన బ్యాటింగ్‌కు రాలేదు. మిడిల్‌ ఆర్డర్‌కు అవకాశం ఇవ్వాలనుకున్న‌ట్లు చెప్పింది.

మ్యాచ్ అనంతరం మంధాన మాట్లాడుతూ.. "ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా.. బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేని మ్యాచ్‌లు చాలా తక్కువ మాత్రమే లభిస్తాయి. మిగతా బ్యాట్స్‌మెన్‌లందరికీ అవ‌కాశం అవసరం. గత మ్యాచ్‌లలో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చేయలేదు. పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దక్షిణాఫ్రికా సిరీస్‌లో మిడిల్ ఆర్డర్‌కు అవ‌కాశం లభించలేదు. కాబట్టి వారికి కొంత సమయం లభించడం మంచిదని తెలిపింది.

దంబుల్లాలోని రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన‌ ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. షెఫాలీ వర్మ (81), దయాళన్ హేమలత (47) 122 పరుగుల భారీ భాగస్వామ్యంతో భారత్ 20 ఓవర్లలో మూడు వికెట్లకు 178 పరుగులు చేసింది. అనంత‌రం నేపాల్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 96 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీప్తి శర్మ మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు వెన్ను విరిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ 82 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Tags:    

Similar News