IND W vs PAK W : ఆరంభం అదిరింది.. పాకిస్థాన్‌పై టీమిండియా విక్టరీ..!

మహిళల ఆసియాకప్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగింది.

By :  Eha Tv
Update: 2024-07-20 03:20 GMT

మహిళల ఆసియాకప్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 10 వికెట్లకు 108 పరుగులు చేసింది. అనంత‌రం భారత జట్టు 14.1 ఓవర్లలో మూడు వికెట్లకు 103 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మహిళల ఆసియా కప్ 2024లో భారత్ విజయంతో టోర్నీని ప్రారంభించింది. భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో గ్రూప్-ఎలో భారత్ రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది.

మహిళల ఆసియా కప్‌లో భాగంగా శుక్రవారం దంబుల్లాలోని రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో భారత్-పాక్ మధ్య రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 10 వికెట్లకు 108 పరుగులు చేసింది. అనంత‌రం భారత జట్టు 14.1 ఓవర్లలో మూడు వికెట్లకు 103 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

భారత్ విజయంలో ఓపెనింగ్ జోడీ కీలక పాత్ర పోషించింది. తొలి వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం నెల‌కొల్పారు. భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన 31 బంతుల్లో 45 పరుగులు చేసి ఔట్ అయింది. ఆమె ఇన్నింగ్సులో తొమ్మిది ఫోర్లు ఉన్నాయి. మ‌రో ఓపెన‌ర్ షెఫాలీ వర్మ 29 బంతుల్లో 40 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకుంది. ఆమె ఆరు ఫోర్లు, ఒక సిక్స్ బాదింది. 14 పరుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వద్ద దయాళన్ హేమలత ఔటయ్యింది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ ఐదు పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. జెమిమా రోడ్రిగ్స్ ఆరు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.

Tags:    

Similar News