IND W vs SL W : టీమిండియాను చిత్తుగా ఓడించిన శ్రీలంక.. తొలిసారి ఆసియా కప్ టైటిల్ కైవ‌సం

ఆసియా క‌ప్ టీ20 ఫైనల్లో భారత మహిళల జట్టు శ్రీలంకతో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

By :  Eha Tv
Update: 2024-07-29 01:21 GMT

ఆసియా క‌ప్ టీ20 ఫైనల్లో భారత మహిళల జట్టు శ్రీలంకతో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 18.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి విజయం సాధించింది. భారత్ రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఫైనల్ ఆడింది. అయితే డిఫెండింగ్ ఛాంపియన్‌ టైటిల్‌ను కాపాడుకోవడంలో విఫలమ‌య్యింది.

ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. దీంతో ఆతిథ్య శ్రీలంక‌ జట్టు తొలిసారి ఈ టైటిల్‌ను గెలుచుకుంది. దంబుల్లాలోని రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన‌ ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 165 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 18.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి విజయం సాధించింది.

భార‌త జ‌ట్టులో స్మృతి మంధాన అర్ధ సెంచరీ చేసింది. 47 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 60 పరుగులు చేసింది. చివ‌ర్లో రోడ్రిగ్స్‌(29), రిచా ఘోష్‌(30) రాణించ‌డంతో భారత మహిళల జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 165 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో కవిష్క దిల్హరి రెండు వికెట్లు తీసింది. చేధ‌న‌లో చ‌మ‌రి ఆట‌ప‌ట్టు(61), హ‌ర్షిత స‌మ‌ర‌విక్ర‌మ‌(69), క‌విష దిల్హ‌రి(30) ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందించారు. ఆసియాక‌ప్‌లో ఇప్ప‌టికి ఐదుసార్లు ఫైన‌ల్‌కు వెళ్లిన శ్రీలంక ఒక్క‌సారి కూడా టైటిల్ సాధించ‌లేక‌పోయింది. ఆర‌వ‌సారి టైటిల్ నెగ్గింది. 

Tags:    

Similar News