Ajit Agarkar : హార్దిక్‌ను కాద‌ని సూర్యకుమార్‌కు టీ20 కెప్టెన్సీ ఎందుకు అప్పగించారో చెప్పిన అగార్కర్..!

టీ20 ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత టీమ్‌ ఇండియాలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.

By :  Eha Tv
Update: 2024-07-22 08:02 GMT

టీ20 ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత టీమ్‌ ఇండియాలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. గౌతమ్ గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించిన వెంటనే టీ20లో కెప్టెన్సీలో మార్పు వచ్చింది. T20 ప్రపంచకప్ 2024లో వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా.. T20 ఇంటర్నేషనల్స్ నుండి రిటైర్మెంట్ అయిన రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేస్తాడ‌ని అంతా అనుకున్నారు. అయితే.. ఇది జరగలేదు. శ్రీలంక పర్యటనకు కొత్త టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. ఈ నిర్ణయం జట్టుకు సరైనది కాదని సోషల్ మీడియాతో పాటు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. దీంతో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ నిర్ణయం వెనుక అస‌లు కథను వెల్లడించారు. సోమవారం కోచ్ గంభీర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో.. అగార్కర్ తాను ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వివరించాడు.

అగార్కర్ మాట్లాడుతూ.. సూర్యకుమార్‌కు మంచి క్రికెట్ మైండ్ ఉంది. T20ల్లో అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. మేము కెప్టెన్‌ను ఎన్నుకునే థీమ్ ఏమిటంటే.. భవిష్యత్తులో టీమ్ ఇండియాకు దాదాపు అన్ని మ్యాచ్‌లు ఆడే కెప్టెన్‌ను ఎంచుకోవాలనుకుంటున్నాము. సూర్యకుమార్ కెప్టెన్సీకి అర్హుడని మేము భావించాము. రాబోయే కాలంలో అతడి పనితీరు ఎలా ఉంటుందో.. అతడు ఈ పాత్రను ఎలా మలచుకుంటాడో చూడాలి అని అన్నాడు.

పాండ్యా ఇప్పటికీ మాకు అత్యంత ముఖ్యమైన ఆటగాళ్లలో ఒకడు. అతడు మంచి ఆటగాడిగా జ‌ట్టులో ఉండాలని మేము కోరుకుంటున్నాము. అతడికి ఉన్న నైపుణ్యాలను అంచ‌నా వేయ‌డం చాలా కష్టం. అయితే.. ఫిట్‌నెస్ అతడికి సవాలుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కోచ్‌కి, సెలక్టర్‌కి, టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు కాస్త కష్టంగా మారుతుంది. వచ్చే టీ20 ప్రపంచకప్‌కు ముందు మాకు చాలా సమయం ఉంది. అటువంటి పరిస్థితితుల‌లో మేము కొన్ని ప్రయత్నించాలనుకుంటున్నాము. పరిస్థితి ఎలా మారుతుందో చూడాలనుకుంటున్నాము. కానీ హార్దిక్ ఇప్పటికీ మాకు అత్యంత ముఖ్యమైన ఆటగాడు. కెప్టెన్‌ను మార్చాలనుకున్న‌ప్పుడు హార్దిక్, సూర్యకుమార్‌తో సహా ఆటగాళ్లందరితో మాట్లాడామని అగార్కర్ చెప్పారు.

రాహుల్ స్థానంలో హార్దిక్ కెప్టెన్ అయినప్పుడు నేను సెలెక్టర్‌ని కాదు. నేను సెలెక్టర్ అయినప్పుడు ODI ప్రపంచ కప్ వస్తోంది. దాదాపు వెంటనే T20 ప్రపంచ కప్ ఉంది. హార్దిక్‌కు ఫిట్‌నెస్ సమస్యగా మారింది. కేవలం ఫిట్‌నెస్ మాత్రమే కాదు. సూర్యకుమార్‌కు విజయవంతమైన కెప్టెన్‌గా ఎదిగే అవకాశం ఉందని మేము భావిస్తున్నాము. రెండు సంవత్సరాలు చాలా కాలం. దీంతో మనం ఏదైనా ప్రయత్నించడానికి చాలా సమయం ఉంది. మాకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఆటగాళ్లకు ఎక్కువ‌ అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాము. ఆట‌గాడిగా హార్దిక్‌ మరింత మెరుగ్గా రాణించాల‌ని భావిస్తున్నాం. ఈ టీ20 ప్రపంచకప్‌లో అతడు బంతితో, బ్యాట్‌తో ఏం చేశాడో చూశాం. అటువంటి పరిస్థితితులలో అతడి ప్రదర్శన జట్టుకు చాలా ముఖ్యం. కెప్టెన్సీ సమస్య కాదు. ఈ నిర్ణయం కోసం ఆటగాళ్లందరితో మాట్లాడామ‌ని అగార్క‌ర్ అన్నాడు.

సూర్యకుమార్ యాద‌వ్‌ T20 బ్యాటింగ్ గురించి ఎప్పుడూ ఆందోళన చెందలేదు. కెప్టెన్సీ నిర్ణయం చాలా ఆలోచించి తీసుకున్నది. ఇది ఓ రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. జట్టులో ఆట‌గాడి స్థానం ప్రమాదంలో ఉన్నప్పుడు.. ఏ ఆటగాడు కెప్టెన్సీని సుఖంగా భావించడు. కెప్టెన్సీ విషయంలో చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. దీనిపై చాలా ఆలోచనలు జరిగాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో అడిగాం. సూర్యకుమార్ వీటన్నింటికి అనుగుణంగా ఉన్నాడ‌ని నేను భావించాన‌ని అగార్క‌ర్ ముగించాడు.

Tags:    

Similar News