Telegram : టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, CEO పావెల్ దురోవ్ అరెస్ట్

టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ అరెస్ట్ అయ్యారు

Update: 2024-08-25 04:06 GMT

టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ అరెస్ట్ అయ్యారు. శనివారం సాయంత్రం పారిస్‌లోని బోర్గెట్ విమానాశ్రయంలో ఆయ‌న‌ను అరెస్టు చేశారు. దురోవ్ ప్రైవేట్ జెట్ ద్వారా అజర్‌బైజాన్ నుండి బోర్గెట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఫ్రెంచ్ ప్రభుత్వం అతనిపై అప్ప‌టికే అరెస్ట్ వారెంట్ జారీ చేయ‌గా.. ఆయ‌న అరెస్ట‌య్యారు.

మీడియా నివేదికల ప్రకారం.. ఫ్రెంచ్ కస్టమ్స్‌కు అనుబంధంగా ఉన్న ఫ్రాన్స్ యాంటీ ప్రాడ్‌ అధికారులు శనివారం సాయంత్రం పావెల్ దురోవ్ ను అదుపులోకి తీసుకున్నారు. టెలిగ్రామ్‌లో నియంత్రణ లేకపోవడం వల్ల 39 ఏళ్ల దురోవ్‌పై ఫ్రెంచ్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ ప్లాట్‌ఫారమ్ మనీలాండరింగ్, డ్రగ్స్ ట్రాఫికింగ్, పెడోఫైల్ మెటీరియల్ వంటి మోస‌పూరిత‌, చ‌ట్ట వ్య‌తిరేక మోసాల‌కు ఉపయోగిస్తున్న‌ట్లు ఆరోపణలు వచ్చాయి.

అరెస్ట్ వారెంట్ జారీ అయినప్పటి నుండి టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ ఫ్రాన్స్, యూరప్‌లకు వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. టెలిగ్రామ్‌పై మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లలపై నేరాలు, చట్ట అమలుకు సహకరించకపోవడం వంటి ఆరోపణలు రావ‌డంతో ఫ్రాన్స్ దురోవ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రష్యాలో జన్మించిన టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు.. పావెల్ దురోవ్ ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్నారు. టెలిగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా 900 మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉంది.

దురోవ్ ఆగస్టు 2021లో ఫ్రెంచ్ పౌరసత్వాన్ని పొందాడు. దురోవ్ ర‌ష్యాలో VKontakte అనే సోషల్ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు. కొన్ని కార‌ణాల‌తో ఆయ‌న‌ 2014లో రష్యాను విడిచిపెట్టాడు. రష్యా కూడా టెలిగ్రామ్‌ను నిషేధించడానికి ప్రయత్నించింది. టెలిగ్రామ్ రష్యన్ మాట్లాడే ప్రజలచే టెలిగ్రామ్ విస్తృతంగా ఉపయోగించబడుతుంది. దీని ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం షేర్ అవుతోంది. రష్యన్ సైన్యం కమ్యూనికేషన్ కోసం టెలిగ్రామ్‌ను ఉపయోగిస్తుందని నివేదిక‌లు ఉన్నాయి.

Tags:    

Similar News