Supreme Court : బెంగాల్‌లో సీబీఐ ఎంట్రీ.. మమతా స‌ర్కార్‌కు 'సుప్రీం' ఉపశమనం

సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారంటూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

By :  Eha Tv
Update: 2024-07-10 06:56 GMT

సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారంటూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించాలని కోర్టు నిర్ణయించింది. పిటీష‌న్‌లో రాష్ట్ర పరిధిలోకి వచ్చే కేసులను సీబీఐ విచారణకు పంపిందని మమత ప్రభుత్వం ఆరోపించింది. ఆ కేసులను సీబీఐ ఏకపక్షంగా విచారిస్తున్నార‌ని.. ఈ విషయాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని పిటీష‌న్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌ను విచారించాలని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం అంగీకరించింది.

రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ అంశంపై సీబీఐ విచారణ జరపడం సరికాదని కోర్టు పేర్కొంది. పశ్చిమ బెంగాల్ వేసిన కేసు చట్టప్రకారం.. సుప్రీంకోర్టులో కొనసాగుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. కేసు నిర్వహణపై కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ప్రకారం.. కేంద్రంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్‌లో చేపట్టనుంది. సమ్మతిని ఉపసంహరించుకున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం సీబీఐని దర్యాప్తు కోసం రాష్ట్రానికి పంపుతోందని బెంగాల్ ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో సీబీఐ 15కు పైగా కేసులు నమోదు చేసింది.

Tags:    

Similar News