Prashant Kishor : ముహుర్తం ఫిక్స్ చేశాడు.. ఆ రోజే కొత్త రాజకీయ పార్టీ ప్ర‌క‌ట‌న‌

అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయవేత్తగా మారిన ప్రశాంత్ కిషోర్ ఆదివారం ప్రకటించారు.

By :  Eha Tv
Update: 2024-07-29 02:41 GMT

అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయవేత్తగా మారిన ప్రశాంత్ కిషోర్ ఆదివారం ప్రకటించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన రాజకీయ పార్టీని ప్రారంభించ‌నుండ‌టంతో చాలా ఆస‌క్తి రేగుతుంది. అంద‌రి గెలుపోట‌ముల‌పై మాట్లాడే ప్రశాంత్ కిషోర్.. తన పార్టీ విధివిధానాలు ఎలా ఉంటాయ‌నే చ‌ర్చ న‌డుస్తుంది.

పాట్నాలోని బాపు సభాఘర్‌లో జన్ సూరాజ్ అభియాన్ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 2న పార్టీకి శంకుస్థాపన చేస్తామని, లక్ష మందికి పైగా ఆఫీస్ బేరర్లుగా పార్టీ ప్రారంభమవుతుందని చెప్పారు. 2025లో బీహార్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ప్రశాంత్ కిషోర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ మనవరాలు డాక్టర్ జాగృతితో సహా ముగ్గురు పెద్ద నాయ‌కులు పాల్గొన్న‌ట్లు తెలుస్తుంది. మొదటి సమావేశం జూలై 28న పాట్నాలో నిర్వహించగా.. ఇందులో జిల్లా, బ్లాక్ స్థాయి కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. రెండవ సమావేశం ఆగస్టు 4న జరుగుతుంది. ఇందులో జన్ సూరజ్‌తో సంబంధం ఉన్న యువకులందరూ పాల్గొంటారు.

Tags:    

Similar News