Nita Ambani : పదేళ్ల తర్వాత కాశీని దర్శించుకున్న నీతా అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి రాధికా మర్చంట్‌తో వచ్చే నెల 12వ తేదీన జరగనుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి రాధికా మర్చంట్‌తో వచ్చే నెల 12వ తేదీన జరగనుంది.పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ కాశీకి వెళ్లారు. అక్కడున్న కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను కాశీ విశ్వనాథుడి ఆదాల చెంత ఉంచారు. తన కొడుకు పెళ్లికి ఆదిదంపతుల కుటుంబాన్ని ఆహ్వానించారు. పూజల తర్వాత నీతా అంబానీ మీడియాతో ముచ్చటించారు. అనంత్- రాధిక పెళ్లి పత్రికను శివుడికి ఇవ్వడానికే కాశీకి వచ్చానని నీతా అంబానీ చెప్పారు. దాదాపు పదేళ్ల తర్వాత కాశీకి వచ్చినట్టు తెలిపారు. కాశీలో జరుగుతున్న అభివృద్ధి తనకు ఎంతో సంతోషం కలిగిందన్నారు. అక్కడున్న ఓ సాధారణ దుకాణంలో చాట్‌ను ఆస్వాదించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి నీతా అంబానీకి కాశీ విశ్వనాథ ఆలయ నమూనాను బహుమతిగా ఇచ్చారు. అనంత్-రాధిక పెళ్లి ముంబాయిలో ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. జూలై 12వ తేదీన మొదలవుతుంది. జూలై 14వ తేదీన మంగళ ఉత్సవ్‌తో ముగుస్తుంది. ఈ పెళ్లికి పలువురు బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ తారలతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రముఖులు రానున్నారు.పదేళ్ల తర్వాత కాశీని దర్శించుకున్న నీతా అంబానీ