పశ్చిమ బెంగాల్ గవర్నర్(West Bengal governor) ఆనంద్‌బోస్(Anand bose) వివాదాలు కొని తెచ్చుకుంటుంటారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్(West Bengal governor) ఆనంద్‌బోస్(Anand bose) వివాదాలు కొని తెచ్చుకుంటుంటారు. ఇప్పుడు మరో కాంట్రవర్సీకి కారణమయ్యారు. గవర్నర్‌గా రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఓ చిత్రమైన పని చేశారు. ఆయన విగ్రహాన్ని ఆయనే రాజ్‌భవన్‌లో(Raj bhavan) ఏర్పాటు చేసుకున్నారు. పైగా ఆవిష్కరించుకున్నారు కూడా! విగ్రహావిష్కరణ వీడియోలు సోషల్ మీడియాలో(Socialmedia) వైరల్ అవుతున్నాయి. ఆనంద్ బోస్ చేసిన పనిని చాలా మంది నెటిజన్లు విమర్శిస్తున్నారు. విమర్శలు ఎదురవుతుండటంతో రాజ్‌భవన్ రియాక్టయ్యింది. గవర్నర్ తన విగ్రహాన్ని తాను ఆవిష్కరించుకోలేదని స్పష్టం చేసింది. ఆ విగ్రహం ఆయనకు బహుమతిగా వస్తే తెర తీసి చూసుకున్నారని తెలిపింది.బోస్ చర్యపై అధికార తృణమూల్ కాంగ్రెస్ విమర్శలు చేసింది. సొంత విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎక్కడా వినలేదని, ఎక్కడా చూడలేదని తృణమూల్ నేతలు అంటున్నారు.