New Criminal Laws : నేటి నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు

నేటి నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రానున్నాయి. దీంతో బ్రిటిష్ వలస కాలం నాటి క్రిమినల్ చట్టాలు కాలగర్భంలో కల‌వ‌నున్నాయి.

By :  Eha Tv
Update: 2024-07-01 05:11 GMT

నేటి నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రానున్నాయి. దీంతో బ్రిటిష్ వలస కాలం నాటి క్రిమినల్ చట్టాలు కాలగర్భంలో కల‌వ‌నున్నాయి. సీఆర్పిసీ బదులు బీఎన్ఎస్ఎస్ , ఐపీసీ స్థానంలో బీఎన్ఎస్ , ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో బీఎస్ఎస్ ల అమ‌లుకు కేంద్ర ప్ర‌భుత్వం రంగం సిద్ధం చేసింది. కొత్త క్రిమినల్ చట్టాల అమ‌లుతో ఇక ఎక్కడి నుంచైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనూ ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌వ‌చ్చు. ఈ చ‌ట్టాల ద్వారా ఆడియో, వీడియో సాక్షాలకు ప్రాధాన్యత పెరుగ‌నుంది.

ఘటనా స్థలం నుంచి నేరుగా వీడియో తీసి సాక్షాలను భద్రపరిచేలా క్లౌడ్ బేస్డ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్ట‌మ్‌ను తీసుకువ‌చ్చారు. మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలపై రెండు నెలలో దర్యాప్తు పూర్తి చేయాలనే నిబంధ‌న‌లు ఉన్నాయి. మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడే నేరాలకు 24 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు కావాలనే గైడ్‌లైన్స్ ఉన్నాయి. ఏదైనా కేసులోఅరెస్ట్ అయిన నిందితుల‌ను వెంటనే కాకుండా ఎప్పుడైనా 14 రోజుల పోలీస్ కస్టడీ కోరే అవకాశం కూడా ఉంటుంది. ఉచితంగా ఎఫ్ఐఆర్, చార్జిషీట్ పొందే అవకాశం ఉంది. దర్యాప్తు, విచారణకు సంబంధించి వాట్సాప్ ద్వారా సమన్లు పంపే సిస్ట‌మ్ కూడా అందుబాటులోకి రానుంది. 

Tags:    

Similar News