Congress : హైదరాబాద్‌లో కన్నుమూసిన నాందేడ్ ఎంపీ

ప్రముఖ రాజకీయ నాయకుడు, నాందేడ్‌కు చెందిన కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ వసంత్ బి. చవాన్ దీర్ఘకాలిక అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు పార్టీ నేతలు సోమవారం తెలిపారు

Update: 2024-08-26 04:48 GMT

ప్రముఖ రాజకీయ నాయకుడు, నాందేడ్‌కు చెందిన కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ వసంత్ బి. చవాన్ దీర్ఘకాలిక అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు పార్టీ నేతలు సోమవారం తెలిపారు. 70 ఏళ్ల చవాన్ 2024 సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభకు ఎన్నికయ్యారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ రావు చిఖాలీకర్‌ను ఆయ‌న‌ ఓడించారు. శ్వాస ఆడకపోవటంతో పాటు ఇత‌ర ఆరోగ్య సమస్యల కారణంగా చ‌వాన్‌ ఆగస్టు 13న నాందేడ్ ఆసుపత్రిలో చేరారు. రెండు రోజుల తర్వాత ఆయ‌న‌ను విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. చవాన్ లో బీపీ, మూత్రపిండాలు సహా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చ‌వాన్‌ హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు.

1978లో నైగావ్ గ్రామ సర్పంచ్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చవాన్.. జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఎదిగి.. ఆ త‌ర్వాత‌ మహారాష్ట్ర శాసనసభ, మండ‌లి.. ఉభయ సభలకు ఎన్నికై.. మొత్తం 16 సంవత్సరాలకు పైగా వివిధ ప‌ద‌వుల‌లో కొన‌సాగారు.

చవాన్ అకాల మరణం పట్ల కాంగ్రెస్ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. చవాన్ కుటుంబ స‌భ్యుల‌కు సంతాపాన్ని తెలుపుతున్నాయి. ఆయ‌న రాజకీయాల ద్వారా సమాజానికి చేసిన సేవలను శ్రేణులు గుర్తు చేసుకుంటున్నారు.

Tags:    

Similar News