Lok Sabha Speaker : స్పీకర్‌ ఎన్నికకు ఆ ఏడుగురు ఎంపీలు దూరం!

స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారిగా లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్‌గా ఎన్నికవ్వాలంటే 269 సభ్యుల మద్దతు ఉండాలి.

By :  Eha Tv
Update: 2024-06-26 06:34 GMT

స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారిగా లోక్‌సభ స్పీకర్ ఎన్నిక(Lok Sabha Speaker Election) జరగనుంది. స్పీకర్‌గా ఎన్నికవ్వాలంటే 269 సభ్యుల మద్దతు ఉండాలి. మరోవైపు బీజేపీ విన్నపాన్ని అర్థం చేసుకున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బిర్లా(Om Birla)కే ఓటు వేయాలని నిర్ణయించుకుంది. ఇండియా కూటమి విషయానికి వస్తే మొత్తం 232 మంది ఎంపీలలో 227 మంది ప్రమాణం చేశారు. ఎంపీలుగా ప్రమాణం చేయని వాళ్లలో ఇండియా కూటమికి చెందినవారే ఐదుగురు ఉండగా, మిగతా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు. శశిథరూర్‌, శతృఘ్న సిన్హాలాంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ఎంపీలుగా ప్రమాణం చేయలేదు కాబట్టి ఇవాళ స్పీకర్‌ ఎన్నికలో ఈ ఏడుగురు ఓటింగ్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఏ విధంగా చూసినా ఇండియా కూటమికి మెజారిటీ లేదు. స్పీకర్‌గా ఎన్డీయే అభ్యర్థి బిర్లా ఎన్నికయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. స్పీకర్‌ ఎన్నికకు అవసరమైన మెజారిటీ ఎన్టీయే దగ్గర ఉన్నప్పటికీ 300 ఎంపీల మద్దతు ఉంటే బాగుంటుందని ఆ కూటమి అనుకుంటోంది. ఇందులో భాగంగానే ఎన్టీయే కూటమిలో లేని పార్టీల మద్దతును కూడా బీజేపీ ఆశిస్తోంది. ఎన్డీయే కూటమి నుంచి మాజీ స్పీకర్‌, కోటా ఎంపీ ఓం బిర్లా బరిలో ఉన్నారు. ఇండియా కూటమి నుంచి కేరళ ఎంపీ కే. సురేశ్ బరిలో ఉన్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు స్పీకర్‌ ఎన్నిక జరుగుతుంది.స్పీకర్‌ ఎన్నికకు ఆ ఏడుగురు ఎంపీలు దూరం!

స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారిగా లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్‌గా ఎన్నికవ్వాలంటే 269 సభ్యుల మద్దతు ఉండాలి.

Tags:    

Similar News