Kolkata Doctor Case : 53 ఆధారాలు సేకరించిన సీబీఐ.. ఆ తొమ్మిదిట్లో మాత్రం నిందితుడు త‌ప్పించుకోలేడు..!

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌ అత్యాచారం, హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు.

Update: 2024-08-26 03:54 GMT

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌ అత్యాచారం, హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి 53 ముఖ్యమైన ఆధారాలు లభించాయి. ఇందులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు సంబంధించిన 9 ముఖ్య‌మైన ఆధారాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ కేసులో సంజయ్ రాయ్ కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

సీబీఐ చేతిలో ఉన్న ఆధారాల్లో డిజిటల్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ, ఫోరెన్సిక్ రిపోర్టు ముఖ్యమైనవి. ఇవి కాకుండా.. సంజయ్ రాయ్ దుస్తులు, లోదుస్తులు, చెప్పులను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో అతడు ఆ వస్తువులను ధరించాడు. ఇవే కాకుండా.. ప్రధాన నిందితుడి మొబైల్ టవర్ లొకేషన్‌ను కూడా సీబీఐ తీసుకుంది. మొబైల్ టవర్ లొకేషన్ ప్ర‌కారం.. సంఘటన సమయంలో సంజయ్ రాయ్ అక్కడే ఉన్నాడని చూపిస్తుంది. ఇది కాకుండా అతని బైక్‌, హెల్మెట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నేరస్థలం నుండి సేకరించిన మరో 40 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఈ కేసులో త్వరలో సీబీఐ తన ఛార్జిషీటును కోర్టులో దాఖలు చేయనుంది.

కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైలులో సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. సంజయ్ ఈ జైలులోనే ఉన్నాడు. కోల్‌కతాలోని CBI కార్యాలయంలో సంజయ్ రాయ్‌కు సన్నిహితులైన నలుగురు ట్రైనీ వైద్యులు, వాలంటీర్ అనుప్ దత్‌కు కూడా పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. శనివారం ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌తో సహా నలుగురు ట్రైనీ వైద్యులకు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించబడింది.

Tags:    

Similar News