సోషల్ మీడియాలో పరిచయాలు, ప్రేమలు, వ్యవహారాలు, సంబంధాలు కాపురాలను కొల్లగొడుతున్నాయి.

సోషల్ మీడియాలో పరిచయాలు, ప్రేమలు, వ్యవహారాలు, సంబంధాలు కాపురాలను కొల్లగొడుతున్నాయి. సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్న సంఘటనలు ఎన్నో. తాజాగా ఇదే తరహాలో మరో ఘటన జరిగింది.
హర్యానా(Haryana)లోని భివానీ(Bhiwani)కి చెందిన రవీనా(Ravina), ఆమె భర్త ప్రవీణ్(Praveen)తో వివాహం 2017లో జరిగింది, వారికి ముకుల్(Mukul) అనే ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. రవీనా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ యూట్యూబ్‌లో వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ షేర్ చేసేది. దాదాపు రెండేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హిసార్‌కు చెందిన యూట్యూబర్ సురేష్(Suresh)తో ఆమెకు పరిచయం ఏర్పడింది, ఆ తర్వాత వారు స్నేహితులయ్యారు. అయితే, ఈ స్నేహం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్ల తర్వాత వీరిద్దరి వ్యవహారం భర్త ప్రవీణ్‌కు తెలిసింది. ఇది మానుకోవాలని భార్యను గట్టిగా హెచ్చరించాడు. అయినా వీరి సంబంధం మాత్రం కొనసాగుతూనే ఉంది. 2025 మార్చి 25న రవీనా, సురేష్ రతిలో పాల్గొంటుండగా ప్రవీణ్ వచ్చాడు. వీరిద్దరి అవతారం చూసి ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాగ్వాదం జరిగింది. ఆ రాత్రి, రవీనా, సురేష్ కలిసి ప్రవీణ్‌ను గొంతు బిగించి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత వారు ప్రవీణ్ శవాన్ని బైక్‌పై తీసుకెళ్లి దినోద్ రోడ్డు వద్ద ఒక కాలువలో పడేశారు. మూడు రోజుల తర్వాత, మార్చి 28న పోలీసులు మరియు ప్రవీణ్ కుటుంబం శవాన్ని కనుగొన్నారు. సీసీటీవీ ఫుటేజీలో రవీనా, సురేష్ బైక్‌పై శవంతో కనిపించడంతో పోలీసులు రవీనాను అరెస్ట్ చేశారు, ఆమె ఈ నేరాన్ని అంగీకరించింది. సురేష్ పరారీలో ఉన్నాడు, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
