Kolkata doctor murder : మొదట్లో ఆమెపై పూర్తి నమ్మకం ఉండేది.. కానీ ఇప్పుడు లేదు.. ట్రైనీ డాక్ట‌ర్ త‌ల్లిదండ్రులు

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు

Update: 2024-08-19 04:00 GMT

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా, నిందితులందరినీ పట్టుకునే వరకు దేశప్రజలందరూ తమకు అండగా ఉండాలని మృతురాలి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.

బాధితురాలి తల్లి వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ.. "మేము మొత్తం దేశానికి మీ ద్వారా సందేశం ఇవ్వాలనుకుంటున్నాము. దేశప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రతి ఒక్కరూ మాతో పాటు నిలబడాలని మేము కోరుతున్నాము. నిందితులను పట్టుకునే వరకు ఆగండి. ఏ తల్లికీ ఇలా జరగకూడదని కోరుకుంటున్నాం. బిడ్డల‌ను ఎవరూ పోగొట్టుకోకూడదన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేసును తప్పుగా తీసుకున్నార‌ని.. ఆమె నిరసనను ఆపడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారని.. ఒకరిని మాత్రమే పట్టుకున్నారని.. ఈ నేరంలో మరికొంత మంది కూడా ప్రమేయం ఉంద‌ని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నిరసనలను ఆపేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నాను. అందుకే నిరసనకారుల గుమిగూడకుండా ఉండేందుకు పోలీసులు ఈరోజు నిషేధాజ్ఞలు విధించారు. తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆసుపత్రి అధికారులు మొదట చెప్పారని చెప్పారు. మీ కుమార్తెకు అనారోగ్యంగా ఉందని మొదట ఆస్పత్రి నుంచి ఫోన్‌ వచ్చింది.. ఆ తర్వాత కాల్‌ డిస్‌కనెక్ట్‌ అయింది.. ఆ తర్వాత నేను అడగ్గానే ఆస్పత్రికి రమ్మని చెప్పారు. తర్వాత మేము చేరుకోగానే మమ్మల్ని అనుమతించలేదు. త‌న కూతురుని చూడడానికి అనుమతి వచ్చాక చూస్తే.. ఎవరో ఆమెను హత్య చేసినట్లుగా ఉంది. ఇది ఆత్మహత్య కాదని, హత్య అని నేను వారితో చెప్పాను.. మా కుమార్తెను డాక్టర్ చేయడానికి మేము చాలా కష్టపడ్డాము. కానీ ఆమె హత్య చేయబడింది." కోల్‌కతా పోలీసులు కేసును సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే ముఖ్యమంత్రిపై తమకు నమ్మకం లేదని తల్లిదండ్రులు తెలిపారు. కనీసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అయినా ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆయన తన కుమార్తె డైరీలోని ఒక పేజీని సీబీఐకి అందజేశారు. మొదట్లో (మమతా బెనర్జీ)పై నాకు పూర్తి నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు కాదు. ఆమె న్యాయం గురించి మాట్లాడుతోంది, కానీ దాని కోసం ఆమె ఏమి చేస్తోంది? ఆమె బాధ్యత తీసుకోవచ్చు, కానీ ఏమీ చేయడం లేదు. మాకు న్యాయం కావాలి.. కానీ అదే న్యాయం కావాల‌ని అంటున్న‌ సామాన్య ప్రజల గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని తల్లిదండ్రులు అన్నారు.

మరోవైపు ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ఓ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై సుప్రీంకోర్టు కూడా విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం రేపు ఈ కేసును విచారించనుంది. ఆగస్టు 9న ఆస్పత్రిలోని సెమినార్ హాల్‌లో మహిళా వైద్యురాలి మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Tags:    

Similar News