Internet : ప‌రీక్ష కోసం ఇంటర్నెట్ సేవ‌లు బంద్ చేసిన ప్రభుత్వం

జార్ఖండ్ రాష్ట్రంలోని 823 కేంద్రాలలో జార్ఖండ్ గ్రాడ్యుయేట్ లెవల్ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్న దృష్ట్యా ఆదివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల‌కు అంతరాయం ఏర్పడింది

Update: 2024-09-22 04:28 GMT

జార్ఖండ్ రాష్ట్రంలోని 823 కేంద్రాలలో జార్ఖండ్ గ్రాడ్యుయేట్ లెవల్ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్న దృష్ట్యా ఆదివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల‌కు అంతరాయం ఏర్పడింది. జార్ఖండ్ ప్రభుత్వ సూచనల మేరకు.. వినియోగదారులు ఉదయం 4 నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఎలాంటి ఇంటర్నెట్ సంబంధిత సేవలను ఉపయోగించలేరు.

హోం జైల్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వందనా దాడెల్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో శనివారం కూడా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. డిపార్ట్‌మెంటల్ ఆర్డర్ ప్రకారం.. మాల్‌ప్రాక్టీస్ లేని పరీక్షలను నిర్వహించడానికి ప్రభుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టుకు చెందిన జస్టిస్ ఆనంద్ సేన్, జస్టిస్ అనుభవ రావత్ చౌదరిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. విచారణ సందర్భంగా.. పరీక్షల నేప‌థ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని కోర్టు ప్రశ్నించింది.

నాలుగు వారాల తర్వాత ఈ కేసులో తదుపరి విచారణ జరగనుంది. శనివారం కోర్టు బంద్ కార‌ణంగా ఈ కేసును విచారించడానికి హైకోర్టు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు న్యాయవాది రాజేంద్ర కృష్ణ పిటిషన్‌ దాఖలు చేశారు.

Tags:    

Similar News