ఆహారంలో ఏదో తేడాగా కనిపించింది.. తీరా చూస్తే!!

By :  Eha Tv
Update: 2024-06-17 03:41 GMT

బీహార్‌లోని బంకాలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు కాలేజీ క్యాంటీన్‌లో తమకు అందించిన ఆహారంలో చనిపోయిన పాము కనిపించిందని ఆరోపించారు. కలుషిత ఆహారం తిన్న కనీసం 10-15 మంది ఆసుపత్రి పాలయ్యారు. గురువారం రాత్రి క్యాంటీన్‌లో భోజనం చేయగానే వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయని విద్యార్థులు తెలిపారు. ఓ ప్రైవేట్ మెస్ అందించిన ఆహారంలో చిన్నపాటి చనిపోయిన పాము కనిపించింది. విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించి అనంతరం డిశ్చార్జి చేసినట్లు సమాచారం.

భోజనం నాణ్యతపై ఇప్పటికే కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పరిస్థితిలో ఎలాంటి మార్పులూ రాలేదని విద్యార్థులు చెబుతున్నారు. ఈ సంఘటన తర్వాత, బంకా జిల్లా మేజిస్ట్రేట్ అన్షుల్ కుమార్, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM), సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) ఈ విషయం గురించి తెలుసుకోడానికి సంబంధిత కళాశాలను సందర్శించారు. సబ్ డివిజనల్ అధికారి ఈ విషయంపై విచారణ జరిపి మెస్ యజమానికి జరిమానా విధించారు.


Tags:    

Similar News