Natwar Singh : నట్వర్ సింగ్ క‌న్నుమూత‌.. ప్రధాని సంతాపం

భారత మాజీ విదేశాంగ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నట్వర్ సింగ్ ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి మృతి చెందారు

Update: 2024-08-11 04:38 GMT

భారత మాజీ విదేశాంగ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నట్వర్ సింగ్ ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి మృతి చెందారు. ఆయనకు 93 ఏళ్లు. ఆయన మ‌ర‌ణ‌ వార్తతో రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. సొంత పార్టీ, విపక్షాలకు సంబంధించిన నేతలంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుని సంతాపం తెలిపారు.

నట్వర్ సింగ్ ఫోటోను కూడా ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో షేర్ చేశారు. నట్వర్ సింగ్ మరణానికి నేను చాలా బాధపడ్డాను. ప్రపంచ దౌత్యం, విదేశాంగ విధానానికి ఆయ‌న‌ గొప్ప కృషి చేశారు. ఆయ‌న‌ తన తెలివితేటలతో పాటు అద్భుతమైన రచనకు ప్రసిద్ధి చెందారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నానని పోస్టు షేర్ చేశారు.

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. 'విశిష్ట దౌత్యవేత్త, మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జూలై 2005 నాటి భారతదేశం-యుఎస్ అణు ఒప్పందంలో ఆయ‌న‌ అనేక రచనలు కీలక పాత్రను కలిగి ఉన్నాయి. ఆయ‌న‌ వ్రాసిన పుస్తకాలు, ముఖ్యంగా చైనా గురించి, మన దౌత్యం గురించి విలువైన అంతర్దృష్టులను అందించాయి. ఆయన కుటుంబానికి మా సానుభూతి అని సంతాప సందేశాన్ని ముగించారు.

సీనియర్ రాజకీయ నాయకుడు రణదీప్ సూర్జేవాలా ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో నట్వర్ సింగ్‌కు నివాళులర్పించారు. 'మాజీ విదేశాంగ మంత్రి నట్వర్‌సింగ్‌ మృతి వార్త బాధాకరం. భగవంతుడు ఆయన కుటుంబ సభ్యులకు ఈ నష్టాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను రాశారు.

Tags:    

Similar News