Budget Day : బడ్జెట్, ఆదాయపు పన్ను గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. ఆమె వరుసగా ఏడవ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. దీంతో ఆమె దివంగత మొరార్జీ దేశాయ్ వరుసగా ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డును అధిగమించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మోదీ 3.0 ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి బడ్జెట్‌ను ఆమె పార్లమెంటులో సమర్పించనున్నారు.
భారతదేశంలో ఆదాయపు పన్ను రేటు 1973-74లో అత్యధికంగా ఉండేది. ఆ సమయంలో ఆదాయపు పన్ను వసూళ్ల గరిష్ట రేటు 85 శాతంగా ఉండేది. సర్‌ఛార్జ్‌తో కలిపి ఈ రేటు 97.75 శాతానికి చేరేది. రూ.2 లక్షల ఆదాయం వస్తే ప్రతి రూ.100లో రూ.2.25 మాత్రమే సంపాదకుని జేబులోకి చేరేది. మిగిలిన రూ.97.75 ప్రభుత్వం వద్ద ఉంచుకునేది.
1955లో దేశంలో వివాహితులు, అవివాహితులకు వేర్వేరు పన్ను రహిత ఆదాయాలు ఉండేవి. దీని ప్రకారం.. వివాహితులు 2,000 రూపాయల ఆదాయం వరకూ ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. బ్యాచిలర్లకు ఈ పరిమితి రూ. 1000 మాత్రమే.
1958లో పిల్లల సంఖ్య ఆధారంగా ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చింది ప్రపంచంలో భారతదేశం మాత్రమే. వివాహమై పిల్లలు లేకుంటే రూ. 3000 వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక బిడ్డ ఉన్న వ్యక్తులకు రూ. 3300, ఇద్దరు పిల్లలకు రూ. 3600 ఆదాయం పన్ను మినహాయింపు ఉండేది.
ఇదిలావుంటే.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను నేడు ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులు ఆర్థిక మంత్రి నుండి కొన్ని పెద్ద ఉపశమన ప్రకటనలను ఆశిస్తున్నారు. బడ్జెట్‌కు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సాధారణ బడ్జెట్ అమృతకల్‌కు ముఖ్యమైన బడ్జెట్ అని చెప్పారు. ఇది ఐదేళ్లపాటు మన దిశను నిర్దేశిస్తుందని.. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశానికి పునాది వేస్తుందని అన్నారు.