ఆ నగరాల్లో కూడా ఎయిర్ క్వాలిటీ తగ్గిపోతోందట!!
నిర్దేశించిన గాలి నాణ్యత మార్గదర్శకాలను దాటి
By : Sreedhar Rao
Update: 2024-09-08 03:58 GMT
కర్ణాటకలోని మూడు ప్రధాన నగరాలు బెంగళూరు, మంగళూరు, మైసూరు నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతూ ఉండడంతో గాలి నాణ్యత క్షీణిస్తున్నట్లు గ్రీన్‌పీస్ ఇండియా నివేదిక తెలిపింది. 'స్పేర్ ది ఎయిర్ 2' నివేదిక ప్రకారం దక్షిణ భారతదేశంలోని 10 ప్రధాన నగరాల్లో సగటు PM 2.5, PM10 స్థాయిలు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన గాలి నాణ్యత మార్గదర్శకాలను దాటి వాయు కాలుష్యం పెరుగుతూ ఉండడంతో ప్రజల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు నెలకొనే అవకాశం ఉంది.
హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, కొచ్చి, మంగళూరు, అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, మైసూరు, పుదుచ్చేరిలలో గాలి నాణ్యతా ప్రమాణాలను నివేదిక విశ్లేషించింది. నివేదికకు సంబంధించి ప్రధాన పరిశోధకురాలు ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ, "స్వచ్ఛమైన గాలి మన ఆరోగ్యానికి ప్రాథమికమైనది, WHO మార్గదర్శకాలను అధిగమించి వాయు కాలుష్యం జరుగుతోందని ఈ నివేదిక తెలుపుతోంది." అని అన్నారు. వాయు కాలుష్యం కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరారు. రాబోయే రోజుల్లో వాయు కాలుష్యం పెరిగే అవకాశం ఉందని, ప్రజలు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.