Yogesh Bairagi vs Vinesh Phogat : వినేష్ ఫోగట్‌ను ఎన్నిక‌ల‌లో ఢీ కొంటున్న యోగేష్ బైరాగి ఎవ‌రు.?

2024లో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. బీజేపీ రెండో జాబితాలో మొత్తం 21 మంది అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చారు

Update: 2024-09-10 12:32 GMT

2024లో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. బీజేపీ రెండో జాబితాలో మొత్తం 21 మంది అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చారు. రెండవ జాబితాలో జులనా నుండి కెప్టెన్ యోగేష్ బైరాగికి బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. కాంగ్రెస్ ఈ స్థానం నుండి రెజ్లర్ వినేష్ ఫోగట్‌ను అభ్యర్థిగా బ‌రిలో దింపింది. కెప్టెన్ యోగేష్ బైరాగి హ‌ర్యానా భారతీయ జనతా యువ మోర్చా (BJYM) ఉపాధ్యక్షుడు, BJP స్పోర్ట్స్ సెల్ కో-కన్వీనర్ కావ‌డం విశేషం. దీంతో ఇక్క‌డ‌ పోరు హోరాహూరీగా మారింది. కెప్టెన్ యోగేష్ బైరాగి గతంలో ఎయిర్‌లైన్ పైలట్‌గా కూడా ఉన్నారు.

బీజేపీ ఈరోజు 21 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. అంతకుముందు బీజేపీ మొదటి జాబితాలో మొత్తం 67 మంది అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించింది. అయితే బీజేపీ తొలి జాబితా విడుద‌ల‌ తర్వాత పలువురు కార్యకర్తలు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి బీజేపీ టికెట్ జాబితా తర్వాత 250 మందికి పైగా బీజేపీ నేతలు, పెద్ద సంఖ్య‌లో కార్యకర్తలు పార్టీని వీడారు.

90 సీట్ల హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. కాంగ్రెస్, ఆద్మీ పార్టీల మధ్య పొత్తుపై తొలుత చర్చలు జరిగాయి. అయితే పొత్తు కుదరకపోవడంతో ఇరు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడం మొదలుపెట్టాయి.

Tags:    

Similar News