BJP : రేపు 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చిన బీజేపీ

పశ్చిమ బెంగాల్‌లో డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి

Update: 2024-08-27 12:49 GMT

పశ్చిమ బెంగాల్‌లో డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కోల్‌కతాలో మంగళవారం జరిగిన 'నబన్న నిరసన'లో తీవ్ర కలకలం రేగింది. నిర‌స‌న‌ సమయంలో పశ్చిమ బెంగాల్ పోలీసులు విద్యార్థులను అడ్డుకునేందుకు లాఠీచార్జి చేశారు. విద్యార్థుల నిరసనపై లాఠీచార్జి అనంతరం బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్.. రేపు బెంగాల్‌లో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు నిరసనకారులకు సహాయం చేస్తానని సుకాంత మజుందార్ చెప్పారు.

అయితే బీజేపీ బంద్ పిలుపుకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపు అలాంటిదేమీ జరగదని బెంగాల్ ప్రభుత్వం చెబుతోంది. ప్రతి ఒక్కరూ రేపు కార్యాలయానికి రావాలని బెంగాల్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తన ఉత్తర్వుల్లో తెలిపింది. హాజరుకాని వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

లాల్‌బాగ్‌లోని కోల్‌కతా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విద్యార్థులపై లాఠీ ఛార్జి తరువాత విడుదల కోసం ధర్నాలో కూర్చున్న పశ్చిమ బెంగాల్‌లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ మాట్లాడుతూ.. “మరణించిన డాక్టర్ సోదరికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రజల గొంతుల‌ను ఈ నిరంకుశ పాలన అడ్డుకుంటున్నందున‌ మేము సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వవలసి వచ్చింది. "న్యాయానికి బదులుగా మమతా బెనర్జీ పోలీసులు రాష్ట్రంలోని శాంతి ప్రేమికుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.. ప్ర‌జ‌లు మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని మాత్రమే కోరుకుంటున్నారని అన్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో రేపిస్టులు, నేరగాళ్లకు సహాయం చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. "కోల్‌కతాలో పోలీసుల క్రూరత్వానికి సంబంధించిన చిత్రాలు ప్రజాస్వామ్య సూత్రాలకు విలువనిచ్చే ప్రతి ఒక్కరికి కోపం తెప్పిస్తున్నాయి" అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో రేపిస్టులు, నేరస్థులకు సహాయం చేయడం దీదీకి గౌరవం కావొచ్చు.. మహిళల భద్రత కోసం మాట్లాడటం అక్క‌డ‌ నేరం అని దుయ్య‌బ‌ట్టారు.

Tags:    

Similar News