Nalbari Incident : విద్యార్థిని ప్రైవేట్ పార్ట్స్‌లో సోదాలు చేసిన మహిళా పోలీసు.. విచారణకు ఆదేశించిన‌ సీఎం

అస్సాంలో గ్రూప్-3 పరీక్ష సందర్భంగా ఓ మహిళా పోలీసు విద్యార్థిని ప్రైవేట్ పార్ట్స్‌ను సోదా చేయడంపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు

Update: 2024-09-17 01:18 GMT

అస్సాంలో గ్రూప్-3 పరీక్ష సందర్భంగా ఓ మహిళా పోలీసు విద్యార్థిని ప్రైవేట్ పార్ట్స్‌ను సోదా చేయడంపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోమవారం డీజీపీని కోరారు. గ్రూప్-3 పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహిస్తున్న నల్బరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్ధుల‌ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర విభాగం జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కి లేఖ పంపింది.

ఉత్తర లఖింపూర్‌లో జరిగిన మరో సంఘటన గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తనకు తెలియజేసినట్లు హిమంత బిశ్వ శర్మ చెప్పారు. పరీక్ష సమయంలో ఒక మహిళా అభ్యర్థి నుండి కాపీయింగ్ మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. నాకు మా తల్లులు, సోదరీమణుల గౌరవం చాలా ముఖ్యమైనద‌ని.. ఇందులో ఎలాంటి రాజీ కుదరదని ముఖ్య‌మంత్రి అన్నారు.

Tags:    

Similar News