Minister Jitan Ram Manjhi : ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని నీతి ఆయోగ్ చెప్పింది
JD-U నాయకులు బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారు. అయితే.. కేంద్ర MSME మంత్రి జితన్ రామ్ మాంఝీ మాట్లాడుతూ..
JD-U నాయకులు బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారు. అయితే.. కేంద్ర MSME మంత్రి జితన్ రామ్ మాంఝీ మాట్లాడుతూ.. NITI ఆయోగ్.. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి నిబంధనలు ఏమీ లేవని.. అయితే రాష్ట్రాల ఆర్థిక అవసరాలు తీరుతాయని పేర్కొన్నారు.
“దేశంలో ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదాను నీతి ఆయోగ్ స్పష్టంగా నిరాకరించింది. హాజీపూర్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఏదైనా హామీ చేయగలరు.. కానీ ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని అన్నారు. బీహార్‌కు ఆర్థిక సాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. అభివృద్ధికి ఎంత డబ్బు కావాలన్నా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ అందజేస్తారని మాంఝీ అన్నారు.
కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి JD-U నాయకులు బీహార్‌కు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. జలవనరుల శాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి, భవన నిర్మాణ శాఖ మంత్రి అశోక్ చౌదరి తమ డిమాండ్లపై గళం విప్పారు. ఇదిలావుంటే.. ఎన్‌డిఎ ప్రభుత్వంలో భాగమై కూడా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోతున్నారని అధికార జెడి-యును ఆర్‌జెడి నాయకుడు తేజస్వి యాదవ్, కాంగ్రెస్ నాయకుడు మీరా కుమార్ ఎగతాళి చేశారు.
ప్రత్యేక హోదా అనే విషయం తెరమీదకు వస్తే గుర్తొచ్చే మరో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలో లేదు. ప్రత్యేక హోదాపై బీజేపీకి చెందిన పలువురు నేతలు కూడా రాష్ట్ర పర్యటనలలో హామీ ఇచ్చారు. అయితే 10 ఏళ్ల పాలనలో కార్యరూపం దాల్చలేదు. కాగా.. మూడోసారి బీజేపీకి తక్కువ సీట్లు రావడం.. ప్రాంతీయ పార్టీల మద్దతుతో అధికార పీఠంపై కూర్చోవడంతో.. ఎన్డీఏ కూటమికి కీలక మద్దతుదారులుగా ఉన్న టీడీపీ, జేడీయూలు అధికారంలో ఉన్న ఆంధ్ర, బీహార్‌లకు గట్టి మేలే జరుగుతుందని అంతా భావించారు. ఈ క్రమంలోనే ఆ రాష్ట్రాలలో ప్రత్యేక హోదా డిమాండ్ ఎప్పటినుంచో ఉండటంతో.. అదీ తెరమీదకు వచ్చింది. కేంద్ర మంత్రి, నీతి ఆయోగ్ తాజా ప్రకటనతో ఈ అంశం మరింత తీవ్ర చర్చకు దారి తీస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.