Arif Aqueel : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కన్నుమూత‌

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆరిఫ్‌ అకిల్‌ కన్నుమూశారు.

By :  Eha Tv
Update: 2024-07-29 03:39 GMT

మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆరిఫ్‌ అకిల్‌ కన్నుమూశారు. భోపాల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆరిఫ్‌ చాలా కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఆరీఫ్ 1990లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆరిఫ్ భోపాల్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయ‌న (మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రభుత్వంలో) రెండుసార్లు మంత్రి పదవిని కూడా నిర్వహించారు. ఆయనకు మైనారిటీ సంక్షేమం, జైళ్లు, ఆహార శాఖలను అప్పగించారు. అనారోగ్యం కారణంగా ఆరిఫ్ అకిల్ తన కుమారుడు అతిఫ్ అకిల్‌కు భోపాల్ నార్త్ అసెంబ్లీ స్థానాన్ని అప్ప‌గించారు. ప్రస్తుతం అతిఫ్ భోపాల్ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

72 ఏళ్ల ఆరిఫ్ గుండె జబ్బుతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం భోపాల్‌లోని అపోలో సేజ్ ఆసుపత్రిలో చేరారు. ఆదివారం రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన వెంటిలేటర్ సపోర్టుపై ఉన్నారు. ఈ ఉద‌యం ఆయ‌న‌ ఆసుపత్రిలోనే మరణించారు. గతేడాది ఆరిఫ్‌ అకీల్‌కు గుండె శస్త్రచికిత్స జ‌రిగింది. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఆయ‌న‌ ఆపరేషన్ జరిగింది. ఆయ‌న మృతి ప‌ట్ల కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.

Tags:    

Similar News