Rahul Navin : ఈడీకి ఫుల్‌టైమ్ డైరెక్టర్‌గా తాత్కాలిక చీఫ్ రాహుల్ నవీన్

ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లో తాత్క‌లిక‌ స్పెషల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రాహుల్ నవీన్ (57)ని రెండేళ్ల పాటు పూర్తి స్థాయి డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది

Update: 2024-08-15 02:38 GMT

ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లో తాత్క‌లిక‌ స్పెషల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రాహుల్ నవీన్ (57)ని రెండేళ్ల పాటు పూర్తి స్థాయి డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసిన ఉత్తర్వులో.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా రాహుల్ నవీన్ నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి అమలులోకి వచ్చే రెండు సంవత్సరాల వ్యవధి లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయ‌న ఈ ప‌ద‌విలో కొన‌సాగుతారని వెల్ల‌డించింది.

రాహుల్ నవీన్.. 1993 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి. నవీన్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం పూర్తయిన తర్వాత.. గత ఏడాది సెప్టెంబర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాత్కాలిక చీఫ్‌గా నియమితులయ్యారు. సంజయ్ మిశ్రా మొదటిసారిగా అక్టోబర్ 2018లో మూడు నెలల పాటు ED తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులయ్యారు, అతను నవంబర్ 2018లో రెండేళ్ల స్థిర పదవీకాలానికి పూర్తి-సమయం చీఫ్‌గా నియమించబడ్డారు. మిశ్రా పదవీకాలం 2020లో ముగిసింది. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిని రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్‌తో పొడిగించింది. దీనిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెలువ‌డ్డాయి. ఈ చర్యను సుప్రీం కోర్టులో కూడా సవాలు చేశారు, మిశ్రా పదవీకాలాన్ని ఇక పొడిగించకూడదని 2021లో కోర్టు తీర్పు వెలువరించింది.

కాగా.. రాహుల్ నవీన్ నవంబర్ 2019లో ఈడీ ప్రత్యేక డైరెక్టర్‌గా చేరారు. నవీన్ యాక్టింగ్ చీఫ్‌గా ఉన్న సమయంలోనే.. ED ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌లను వేర్వేరు మనీలాండరింగ్ కేసులతో సహా కొన్ని ఉన్నత స్థాయి వ్య‌క్తుల‌ అరెస్టులు జ‌రిగాయి. 

Tags:    

Similar News