Heavy Rains in Delhi : నీట మునిగిన సివిల్స్‌ కోచింగ్ సెంటర్‌.. ముగ్గురు విద్యార్థులు మృతి

దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటు చేసుకుంది. సివిల్స్‌ కోచింగ్‌కు వెళ్లిన ముగ్గురు వాన నీటిలో మునిగి చనిపోయారు. భారీ వర్షాలకు సెంట్రల్‌ ఢిల్లీలోని ఓల్డ్‌ రాజిందర్‌ నగర్‌లో రావుస్‌ సివిల్‌ సర్వీస్‌ కోచింగ్‌ సెంటర్‌ సెల్లార్‌లోకి వరద పోటెత్తింది.

By :  Eha Tv
Update: 2024-07-28 09:51 GMT

దేశ రాజధాని ఢిల్లీ(Delhiలో పెను విషాదం చోటు చేసుకుంది. సివిల్స్‌ కోచింగ్‌(Civils Coaching)కు వెళ్లిన ముగ్గురు వాన నీటిలో మునిగి చనిపోయారు. భారీ వర్షాల(Heavy Rains)కు సెంట్రల్‌ ఢిల్లీలోని ఓల్డ్‌ రాజిందర్‌ నగర్‌లో రావుస్‌ సివిల్‌ సర్వీస్‌ కోచింగ్‌ సెంటర్‌ సెల్లార్‌లోకి వరద పోటెత్తింది. దీంతో అందులో ఉన్న లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులు నీటమునిగారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ ఘటన స్థలికి వెళ్లి 30 మంది విద్యార్థులను రక్షించారు. ముగ్గురిని మాత్రం రక్షించలేకపోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు యువతులు, ఓ యువకుడు ఉన్నారు. మృతులను తానియా సోని (25), శ్రేయ యాదవ్‌ (25), నవిన్‌ డాల్విన్‌ (28)గా గుర్తించామన్నారు. మృతుల్లో ఒకరు తెలంగాణవాసిగా గుర్తించారు. సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల మృతికి నిరసనగా విద్యార్థలు కోచింగ్​ సెంటర్ ఎదుట ఆందోళనకు దిగారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్​ వల్లే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

నీట మునిగిన సివిల్స్‌ కోచింగ్ సెంటర్‌.. ముగ్గురు విద్యార్థులు మృతి

Tags:    

Similar News