Sabarmati Express Derail : పట్టాలు తప్పిన‌ సబర్మతి ఎక్స్‌ప్రెస్

యూపీలోని కాన్పూర్‌లో నిన్న రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. సబర్మతి ఎక్స్‌ప్రెస్ (వారణాసి-అహ్మదాబాద్, రైలు నంబర్ 19168) కాన్పూర్-భీమ్‌సేన్ స్టేషన్ల‌ మధ్య పట్టాలు తప్పింది

Update: 2024-08-17 04:44 GMT

యూపీలోని కాన్పూర్‌లో నిన్న రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. సబర్మతి ఎక్స్‌ప్రెస్ (వారణాసి-అహ్మదాబాద్, రైలు నంబర్ 19168) కాన్పూర్-భీమ్‌సేన్ స్టేషన్ల‌ మధ్య పట్టాలు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగ‌లేదు. ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా స్పందించారు.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ట్వీట్ లో.. ఈరోజు తెల్లవారుజామున 2.35 గంటలకు సబర్మతి ఎక్స్‌ప్రెస్ (వారణాసి-అహ్మదాబాద్) ఇంజిన్ ట్రాక్‌పై ఉంచిన వస్తువును ఢీకొట్టింది. కాన్పూర్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. ఐబీ, యూపీ పోలీసులు ప్ర‌మాదంపై ఆరా తీస్తున్నారు. ప్రయాణికులకు, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. అహ్మదాబాద్‌కు వెళ్లేందుకు ప్రయాణికుల కోసం రైలు ఏర్పాట్లు చేశామ‌ని తెలిపారు.

మరోవైపు కాన్పూర్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్రమాద స్థలాన్ని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రాకేష్ వర్మ పరిశీలించారు. 22 బోగీలు పట్టాలు తప్పాయని ఆయన తెలిపారు.

కాన్పూర్ రైల్వే స్టేషన్ నుండి రైలు బయలుదేరిన వెంటనే.. మాకు పెద్ద శబ్దం వినిపించిందని.. కోచ్ కంపించడం ప్రారంభించిందని ఒక ప్రయాణికుడు వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు. నేను చాలా భయపడ్డాను కాని రైలు ఆగిందని పేర్కొన్నాడు.

ప్ర‌మాదం కార‌ణంగా ప‌లు రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌లిగింది.

(1) 04143 (ఖజురహో-కాన్పూర్ సెంట్రల్) రైలు పాక్షికంగా రద్దు చేశారు.

(2) 04144 (కాన్పూర్ సెంట్రల్ - ఖజురహో) 17.08.24న బందా నుండి ప్రారంభమవుతుంది.

05326 (లోకమాన్య తిలక్ టర్మ్ - గోరఖ్‌పూర్) ను వీరాంగన లక్ష్మీ బాయి ఝాన్సీ-గ్వాలియర్-భింద్-ఇటావా-కాన్పూర్ సెంట్రల్ మీదుగా మార్చబడింది.

Tags:    

Similar News