మహారాష్ట్ర ఎన్నికల్లో(Maharashtra Elections) రేవంత్(Revanth reddy) ప్రచారంపై అధిష్టానం పెంచుకున్న ఆశలు అడియాశలు అయ్యాయి.
మహారాష్ట్ర ఎన్నికల్లో(Maharashtra Elections) రేవంత్(Revanth reddy) ప్రచారంపై అధిష్టానం పెంచుకున్న ఆశలు అడియాశలు అయ్యాయి. హైకమాండ్ అంచనాలు తలకిందులయ్యాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో(Telangana elections) కాంగ్రెస్‌ను గెలిపించి, అధికారంలోకి తీసుకొచ్చాడని బాహుబలి రేంజ్లో ఊహించుకున్న కాంగ్రెస్(Congress).. లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్‌తో జోరుగా ప్రచారం చేపించింది. లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ ఓ బ్రహ్మాస్త్రం ఉపయోగించి దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసి ఆయన వార్తల్లో నిల్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ లకు ముప్పు అంటూ బాంబ్ పేల్చారు రేవంత్. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా కానీ దేశవ్యాప్తంగానైతే రేవంత్ ప్రచారం చర్చ జరిగింది. దీంతో అధిష్టానం నుంచి అప్పట్లో ప్రశంసలు కూడా అందుకున్నారు రేవంత్. అదే ధీమాతో రేవంత్ రెడ్డికి మహారాష్ట్ర స్టార్ క్యాంపెయినర్ బాధ్యతలు అప్పగించారు. అనుకున్నట్లుగానే పలు దఫాలు మహారాష్ట్ర వెళ్లి కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ప్రచారం చేశారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అయితే ఈ సారి ఈ ఎన్నికల్లో రేవంత్ బాంబు తుస్సుమంది అన్న వార్తలు వస్తున్నాయి. రిజర్వేషన్లపై రేవంత్‌రెడ్డి ప్రచారం మహారాష్ట్రలో కలిసి వస్తుందని అధిష్టానం అంచనాలు పెట్టుకుంది. అయితే అధిష్టానం అంచనాలు తలకిందులయ్యాయి. రేవంత్ ప్రచారం ఓట్లు రాల్చకపోవడంతో హైకమాండ్ నైరాశ్యంలో పడిపోయిందని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల గుసగుసలాడుకుంటున్నాయట.