Cyber Crime : ఇప్పుడంతా సెక్స్‌టార్షన్ మోసాలే సుమా
మనుషులను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయడం ఒకప్పుడు ఉండేది. దాన్నే ఎక్స్‌టార్షన్ అంటారు.
మనుషులను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయడం ఒకప్పుడు ఉండేది. దాన్నే ఎక్స్‌టార్షన్(Extorsion) అంటారు. అందమైన యువతులను ఎరేసి తర్వాత బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు లాగడం ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. దీన్నే సెక్స్‌టార్షన్ అంటారు. ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని కొత్త కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు(Cyber Crime). సమాజంలో చిన్నచిన్న ఆకర్షణలకు లోనయ్యే పెద్ద మనుషులను టార్గెట్ చేసి వసూళ్ల పర్వానికి తెరలేపిందీ ముఠా. కొందరు బహిరంగంగా తమకు జరిగిన మోసాన్ని పోలీసుల ముందుకు వచ్చి చెప్తుండగా కొందరేమో పరువు పోతుందని భయంతో వాళ్లు డిమాండ్ చేసినంత ముట్టజెప్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికి ఇలాంటి కేసులు 2 వేలకుపైగా నమోదుకాగా బాధితులు ఏకంగా 4.5 కోట్లు పోగొట్టుకున్నారని పోలీసుల విచారణలో తేలింది. సోషల్ మీడియా(Social Media)లో అన్‌నోన్ పేర్లతో ఫ్రెండ్ రిక్వెస్టులు పంపించడాలు, వాటిలో అందమైన యువతుల ఫొటోలతో డీపీలు పెట్టుకోంటారు. తమ మొబైల్స్‌లో పోర్న్‌సైట్లను, శృంగార వీడియోలను చూసే సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు తెలుసుకుంటున్నారు. ఇలాంటి వారి వివరాలను సేకరించడానికే కొన్ని సంస్థలు ప్రత్యేకంగా పోర్న్ సైట్ల లాంటివి నడుపుతుంటాయి. ఒక్కసారి వీటిని చూస్తే ఐపీ అడ్రస్‌తో ఆ సెల్‌ఫోన్ యజమాని వివరాలు వెబ్‌సైట్ల నిర్వాహకులకు తెలిసిపోతుంది. ఈ వివరాలను వీరు సైబర్ నేరగాళ్లకు అమ్ముకుని క్యాష్ చేసుకుంటున్నారు. హాయ్ అని మెసేజ్ చేసి ముందుగా ముగ్గులోకి దింపుతారు. ఆ తర్వాత కొన్నాళ్లు చాటింగ్ చేసి ఫోన్ నెంబర్ ఇచ్చి పుచ్చుకుంటారు. కొన్నిరోజులు తియ్యగా మాట్లాడి వీడియో కాల్స్‌కు వస్తారు. అక్కడ వారు నగ్నంగా మారి వీడియోలు పెడతారు. ఆ తర్వాత బాధితులను నగ్నంగా మారాలని కోరుతారు. వారి మాటలకు రెచ్చిపోయిన బాధితులు నగ్నంగా మారుతారు.
ఇక అక్కడి నుంచి మొదలవుతుంది వారి ఆట. బాధితులు నగ్నంగా మారిన వీడియోను రికార్డ్ చేస్తారు. ఈ వీడియోలతో ఇక బెదిరింపులకు పాల్పడుతుంటారు. మీ నగ్న వీడియో మా వద్ద ఉంది దీనిన సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరిస్తారు. అంతేకాదు ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్‌లో ఉన్న మీ స్నేహితులు, ఫాలోవర్లకు ఈ వీడియోను పంపిస్తామని చెప్తారు. దీంతో పరువు పోతుందన్న భయంతో ముఠా అడిగినంత డబ్బును ముట్టజెప్తున్నారు. అయినా కానీ వారు అక్కడితో ఆగిపోరు. మరోసారి ఇలా డబ్బు కావాలంటూ బెదిరిస్తారు. ఇక ఇచ్చే పరిస్థితులు లేక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ వ్యవహారమంతా చాలా వ్యవస్థీకృతంగా జరుగుతోంది. పేరుకి ఎవరో మహిళ ఇదంతా నిర్వహిస్తున్నట్లు కనిపించినా వెనుక పెద్ద ముఠానే పనిచేస్తుంది.
ఇలాంటి సైబర్ మోసాలను అరికట్టేందుకు నిపుణులు, Police Says Sextortion Cases on the Rise, Targeting Teen Boys, Thorn Research Findsస్తున్నారు. అన్‌నోన్ నంబర్ల నుంచి వచ్చే వీడియోకాల్స్‌కు ఆన్సర్ చేయకూడదని చెప్తున్నారు. తెలియని వ్యక్తులు పంపే ఫ్రెండ్ రిక్వెస్టులను యాక్సెప్ట్ చేయకపోవడమే కాకుండా వాళ్లను వెంటనే బ్లాక్ చేయాలని.. సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకొని మొబైల్ నెంబర్ తీసుకొని అక్కడి నుంచి కథ నడిపిస్తారని చెప్తున్నారు. సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పోర్న్ సైట్లు చూసేవారు ఇలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని వీరి కంప్యూటర్లు, ఫోన్‌నెంబర్ల ద్వారా ఐపీ అడ్రెస్‌లను హ్యాక్ చేస్తారని.. అసలు పోర్న్ సైట్లవైపు వెళ్లొద్దని చెప్తున్నారు.ఇప్పుడంతా సెక్స్‌టార్షన్ మోసాలే సుమా