సింగపూర్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అగ్నిప్రమాదంలో చిక్కుకుని గాయపడ్డ విషయం తెల్సిందే.

సింగపూర్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అగ్నిప్రమాదంలో చిక్కుకుని గాయపడ్డ విషయం తెల్సిందే. ఈ విషయం తెలుసుకున్న మాజీ సీఎం జగన్ ఆయనకు సానుభూతి ప్రకటించారు. ఎక్స్‌వేదికగా స్పందించారు.''సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి నేను షాక్ అయ్యాను. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు వారి కుటుంబంతో ఉన్నాయి. ఆయన త్వరగా మరియు పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.'' అని జగన్ ట్వీట్ చేశారు.
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో చదువుతున్న స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ఘటన సోమవారంచోటు చేసుకుంది. ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు మరియు కాళ్లకు గాయాలు కాగా, ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో శ్వాస సంబంధిత ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. ప్రస్తుతం అతన్ని సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు, అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
