థాంక్యూ సర్ అన్నందుకు విమానంలోంచి దించేశారు!
థాంక్యూ సర్ అన్నందుకు విమానంలోంచి దించేశారు!మనల్ని ఎవరైనా సర్‌కు బదులుగా పొరపాటున మేడమ్ అన్నారే అనుకోండి.. ఏం చేస్తాం? చాలా లైట్‌గా తీసుకుంటాం!
థాంక్యూ సర్ అన్నందుకు విమానంలోంచి దించేశారు!మనల్ని ఎవరైనా సర్‌కు బదులుగా పొరపాటున మేడమ్ అన్నారే అనుకోండి.. ఏం చేస్తాం? చాలా లైట్‌గా తీసుకుంటాం! ఏదో కంగారులో అలా అని ఉంటార్లే అని అనుకుంటాం! కొందరు మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటారు సుమండి!తెగ ఫీలవుతారు. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సిబ్బందిలో ఒకరు ఇలాగే ఫీలయ్యారు. మహిళా సిబ్బందిని ఓ ప్రయాణికురాలు పొరపాటున సర్ అన్నందుకు ఏకంగా విమానంలోంచే దించేశారు. అసలేం జరిగిదంటే టెక్సాస్(Texas)కు చెందిన US Woman Jenna Longoria Removed From Flight For Misgendering Crew Member(Jenna Languriya) తన 16 నెలల కుమారుడు, తల్లితో కలిసి శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఆస్టిన్ వెళ్లాలని అనుకున్నారు. విమానం ఎక్కే సమయంలో ఓ మహిళా సిబ్బంది బోర్డింగ్ పాస్‌ను అందించారు. ఆ మహిళా అటెండెంట్‌ను పొరపాటుగా పురుషునిగా భావించిన ఆమె వినయంగా థాంక్యూ సర్ అని అంది. దాంతో ఆ అటెండెంట్‌కు కోపం వచ్చేసింది. జెన్నా తల్లిని, బిడ్డను లోనికి వెళ్లకుండా ఆపేసింది. దాంతో జెన్నా మరో మేల్ అటెండెంట్ సాయం కోరింది. తన తల్లి, కుమారుడిని గేట్ దగ్గర మరో మేల్ అటెండెంట్ ఆపేశారని ఫిర్యాదు చేసింది. మీరు ఫిర్యాదు చేయాలనుకున్న అటెండెంట్ ఆయన కాదని, ఆమె అని చెప్పారా మేల్ అటెండెంట్. తను చేసిన పొరపాటును తెలుసుకుని ఆ మహిళా సిబ్బందికి జెన్నా క్షమాపణలు చేప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. పైగా విమానం నుంచి దింపేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చెప్పుకుని ఆవేదన చెందుతున్నారు జెన్నా.