Donald Trump Rally : డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పులు.. సాయుధుడు సహా ఇద్దరు వ్యక్తులు మృతి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. పెన్సిల్వేనియాలో ట్రంప్ ర్యాలీ సందర్భంగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ర్యాలీలో ఉన్న వ్యక్తితో పాటు ఓ దుండగుడు కూడా మృతి చెందాడు. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పులు జరిపిన సందర్భంలో.. ట్రంప్‌ను రక్షణ సిబ్బంది వేదికపై నుంచి దించారని CBS న్యూస్ నివేదించింది.
కాల్పుల తర్వాత గందరగోళం నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నాయకుడు డొనాల్డ్ ట్రంప్‌ను కాన్వాయ్‌లో తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో.. ట్రంప్ చెవుల నుండి రక్తం కారుతున్నట్లు చూడవచ్చు. అయితే.. దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ లేదు. భద్రతా సంస్థలు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ట్రంప్ సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటనను సర్వత్రా ఖండిస్తున్నారు. బిడెన్, కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు ఒబామా.. అమెరికా సమాజంలో హింసకు చోటు లేదని నిర్మొహమాటంగా చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ క్షేమంగా ఉన్నారని అమెరికా సీక్రెట్ సర్వీస్ తెలిపింది. శనివారం పెన్సిల్వేనియాలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ర్యాలీపై కాల్పుల ఘటన జరగడంతో భద్రతను పెంచారు. చుట్టూ అన్ని రక్షణ చర్యలు అమలు చేయబడ్డాయి.