North Korea: వరదల విషయంలో అసమర్థత.. 30 మంది అధికారులకు ఉరి

ముప్పై మంది ప్రభుత్వ అధికారులను

Update: 2024-09-04 06:01 GMT

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గత నెలలో ముప్పై మంది ప్రభుత్వ అధికారులను ఉరితీయాలని ఆదేశించారని తెలుస్తోంది. దక్షిణ కొరియాకు చెందిన TV Chosun నివేదిక ప్రకారం వేసవిలో వచ్చిన వరదలను నిరోధించడంలో అసమర్థత చూపించిన అధికారులను కిమ్ శిక్షించారని తెలుస్తోంది. వరదల కారణంగా వేలాది మంది ప్రజలు మరణించడంతో అధికారులపై కన్నెర్ర జేశారు కిమ్. వరద బాధిత ప్రాంతంలో ఇరవై నుండి 30 మంది అధికారులను ఒకే సమయంలో ఉరితీశారని నివేదిక పేర్కొంది.

ఉత్తర కొరియా అత్యంత గోప్యత కారణంగా వివరాలను ధృవీకరించలేనప్పటికీ, చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న చాగాంగ్ ప్రావిన్స్‌లో జూలైలోలో వచ్చిన వరదల నేపథ్యంలో అధికారులను కఠినంగా శిక్షించాలని కిమ్ అధికారులను ఆదేశించినట్లు ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) నివేదించింది. జూలై చివరలో కురిసిన భారీ వర్షాల కారణంగా వాయువ్య నగరం సినుయిజు, పొరుగు పట్టణమైన ఉయిజులో వరదలు సంభవించగా 4,000 కంటే ఎక్కువ గృహాలు, భవనాలు, నిర్మాణాలు, రోడ్లు, రైల్వేకు భారీ నష్టం వచ్చినట్లు నివేదించింది. విపత్తు నివారణ చర్యలను అమలు చేయకుండా ప్రాణనష్టానికి కారణమైన ప్రభుత్వ అధికారులను కిమ్ బాధ్యులను చేస్తూ శిక్షించారు.


Tags:    

Similar News