Elon Musk : నన్ను హత్య చేసేందుకు రెండుసార్లు ప్రయత్నించారు

టెస్లా CEO, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌ యజమాని అమెరికాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఘోరమైన దాడి నేప‌ధ్యంలో సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డించాడు.

By :  Eha Tv
Update: 2024-07-15 03:56 GMT

టెస్లా CEO, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌ యజమాని అమెరికాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఘోరమైన దాడి నేప‌ధ్యంలో సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డించాడు. ట్రంప్‌పై దాడి తర్వాత మస్క్ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

'దయచేసి.. మీ భద్రతను మూడు రెట్లు పెంచుకోండి. వారు ట్రంప్ కోసం వ‌చ్చారంటే.. మీ కోసం కూడా వస్తారు.. 'రాబోయే కాలం ప్రమాదకరమైనది. గత 8 నెలల్లో ఇద్దరు వ్యక్తులు (వేర్వేరు సందర్భాలలో) ఇప్పటికే నన్ను చంపడానికి ప్రయత్నించారు. టెక్సాస్‌లోని టెస్లా ప్రధాన కార్యాలయానికి 20 నిమిషాల దూరంలో తుపాకీలతో అరెస్టయ్యాడు. అతడు న‌న్ను ఎప్పుడైనా చంపవచ్చని ఇప్పటికే పేర్కొన్నాడు. 2022లో టెక్ రిపోర్టర్లు తన రైట్ టైమ్‌ లొకేషన్‌ను షేర్ చేశారని ఆరోపించాడు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం నాడు దాడి జ‌రిగింది. అందులో ఆయ‌న‌ తృటిలో తప్పించుకున్నారు. పెన్సిల్వేనియాలో జరిగిన ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతుండగా.. కాల్పులు జరిగాయి. ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవి పైభాగాన్ని తాకింది. ట్రంప్ చెవికి గాయ‌మైంది. ఈ ఘ‌ట‌న‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక దేశాల అధ్య‌క్షులు ఖండించారు.  

Tags:    

Similar News