Sheikh Hasina : తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులను చంపేశారు.. ఆగస్టు నెల ఆమెకు అస‌లే క‌లిసిరాద‌ట‌..!

బంగ్లాదేశ్‌(Bangladesh)లో 49 ఏళ్ల క్రితం నాటి చరిత్ర మరోసారి పునరావృతమైంది.

Update: 2024-08-06 02:07 GMT

బంగ్లాదేశ్‌(Bangladesh)లో 49 ఏళ్ల క్రితం నాటి చరిత్ర మరోసారి పునరావృతమైంది. 1975 ఆగస్టు 15న బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్(Sheikh Mujibur Rahman) హత్య తర్వాత మొదటి తిరుగుబాటు జరిగింది. అప్పుడు కూడా సైన్యం దేశ పగ్గాలు చేపట్టింది. సోదరితో కలిసి భారత్‌లో ఆశ్రయం పొందిన షేక్‌ ముజీబ్‌ కుమార్తె షేక్‌ హసీనా(Sheikh Hasina) ఆరున్నరేళ్లుగా ఢిల్లీ(delhi)లో నివాసం ఉన్నారు. ఈసారి కూడా తిరుగుబాటు నేప‌థ్యంలో భారతదేశం నుండి సహాయం ఆశిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో జరిగిన తిరుగుబాటు.. ఆ తర్వాత జరిగిన అధికార పోరు గురించి తెలుసుకుందాం.

1975 తిరుగుబాటు తర్వాత షేక్ హసీనా మొదటిసారిగా ఆరున్నర సంవత్సరాలు భారతదేశంలోనే ఉన్నారు. ఆమె 18 మే 1981న తన కుమార్తెతో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లింది. ఆమె కోల్‌కతా(Kolkata) నుండి ఇండియన్ ఎయిర్‌లైన్స్(Indian Airlines) విమానంలో ఢాకా విమానాశ్రయం(Daka Airport)లో దిగింది. బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లిన‌ ఆమెకు అవామీ లీగ్ నాయకులు స్వాగతం పలికారు.

అప్పటి బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియా ఉర్ రెహమాన్ చిట్టగాంగ్‌(Chittagong)లో హత్యకు గురైన 12 రోజుల తర్వాత ఆమె తిరిగి 31 మే 1981న అగర్తలా సరిహద్దు నుండి తిరిగి భారతదేశంలోకి ప్రవేశించాలనుకున్నారు, అయితే బంగ్లాదేశ్ రైఫిల్స్ ఆమెను అగర్తలా సరిహద్దులో అరెస్టు చేసింది. ఈసారి కూడా షేక్ హసీనా త్రిపుర(Tripura)లోని అగర్తలా(Agarthala)లో హెలికాప్టర్‌లో దిగింది.

ఐదుసార్లు బంగ్లాదేశ్‌కు ప్రధానమంత్రిగా పనిచేసిన షేక్ హసీనాకు తొలి నుంచి ఆగస్టు నెల(August) క‌లిసిరాలేదు. 1975 సంవత్సరంలో ఆమె తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులు ఆగస్టులో హత్య చేయబడ్డారు. 1989 సంవత్సరం ఆగస్టులోనే ఆమెపై ఘోరమైన దాడి జ‌రిగింది. ఆగష్టు 11, 1989న, రెండు ఆటోలలో ప్రయాణిస్తున్న ముష్కరులు ఆమెపై దాడి చేశారు, ఆమె తృటిలో తప్పించుకుంది. ఈసారి కూడా ఆగస్టు 4, 5 తేదీల్లో జరిగిన నిరసనల తర్వాత తిరుగుబాటులో బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది.

బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ అధ్యక్షురాలిగా ఉన్న షేక్ హసీనా రాజకీయాల ఆరంగ్రేటం నుంచి విద్యార్థి ఉద్యమాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఢాకాలోని ధన్మొండిలో ఉన్న ఆమె ఇంటిపై బుల్లెట్లు వ‌ర్షం కురిసింది. రెండు హ్యాండ్ గ్రెనేడ్లను కూడా పోలీసు సిబ్బంది స్వాధీనం చేసుకుంది. ఛత్ర లీగ్ యువకులు ఆమెపై దాడి చేశారు. 1996లో బంగ్లాదేశ్‌కు తొలిసారిగా ప్రధాని పదవిని చేపట్టినా.. విద్యార్థి ఉద్యమాలు ఆమెను వదలలేదు. ఈసారి కూడా విద్యార్థుల ఆగ్రహావేశాలు, ఆగ్రహావేశాలు పెరగడంతో దేశం విడిచి ఇండియాకు రావాల్సి వచ్చింది. 

Tags:    

Similar News