PM Modi In Austria : ఆస్ట్రియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
రెండు రోజుల రష్యా పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రియా చేరుకున్నారు
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ రష్యా వెళ్లారు. రెండు రోజుల రష్యా పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రియా చేరుకున్నారు. వియన్నాలో ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సమయంలో వారిద్దరూ కౌగిలించుకున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రధాని మోదీని విందుకు స్వాగతించిన ఆస్ట్రియా ఛాన్సలర్ నెహ్మర్.. మిమ్మల్ని స్వాగతించడం నాకు ఆనందంగా, గౌరవంగా ఉందన్నారు. మీ పర్యటనలో రాజకీయ, ఆర్థిక పరమైన చర్చల కోసం నేను ఎదురు చూస్తున్నానని పేర్కొంటూ ప్రధాని మోదీ స్వాగత చిత్రాలను ఛాన్సలర్ కార్ల్ నెహ్మర్ ట్వీట్ చేశారు. నెహ్మర్ చేసిన ట్వీట్‌పై ప్రధాని మోదీ స్పందిస్తూ.. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. భారత్-ఆస్ట్రియా స్నేహం బలంగా ఉంది. రాబోయే కాలంలో అది మరింత బలపడుతుంది. ప్రపంచ ప్రయోజనాల కోసం రెండు దేశాలు కలిసి పని చేస్తూనే ఉంటాయని బదులిచ్చారు.
అందిన సమాచారం ప్రకారం.. ప్రధాని మోదీకి ఉదయం 10 గంటల నుంచి 10.15 గంటల వరకు స్వాగత కార్యక్రమం జరిగింది. అనంతరం గెస్ట్ బుక్‌పై ప్రధాని మోదీ సంతకం చేశారు. ప్రధాని మోదీ ఉదయం 10.15 నుంచి 11 గంటల వరకూ ప్రతినిధుల స్థాయి చర్చలు జరుపుతారు. ప్రధాని మోదీ 11-11.20 నిమిషాలకు మీడియా ప్రకటన ఇవ్వనున్నారు. 11.30 - 12.15 మధ్య PM మోదీ ఆస్ట్రియా-ఇండియా CEO సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30-1.50 గంటల సమయంలో ఆస్ట్రియా ఛాన్సలర్‌తో కలిసి భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.30 గంటల వరకు ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్‌తో చర్చలు జరుపుతారు. మధ్యాహ్నం 3.40 నుంచి 4.30 గంటల వరకు ఆస్ట్రియా ప్రముఖులతో సమావేశమవుతారు. సాయంత్రం 5 గంటలకు విలేకరుల సమావేశం ఉంటుంది. కమ్యూనిటీ ఈవెంట్ 7:00-7:45 p.m. అనంతరం రాత్రి 8.15 గంటలకు ప్రధాని మోదీ భారత్‌కు బయలుదేరుతారు.
ఆస్ట్రియా చేరుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ వియన్నాలో భారతీయ సంతతికి చెందిన వారిని కలిశారు. భారత సంతతి ప్రజల శుభాకాంక్షలను ప్రధాని ముకుళిత హస్తాలతో స్వీకరించారు. ఈ సమయంలో ప్రధాని మోదీతో పాటు ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహ్మర్ కూడా ఉన్నారు.