IAS Officer Wife : ఐఏఎస్‌ భార్య.. చెడు మార్గాలు పట్టింది.. చివరకు ప్రాణాలు తీసుకుంది!

ఆమె ఓ ఐఏఎస్‌ అధికారి భార్య.. సమాజంలో పేరున్న మహిళ. ఎందుకో తెలియదు కానీ చెడు మార్గాలలో పయనించారు. తనకు పరిచయమైన గ్యాంగస్టర్‌తో కలిసి నేరాలకు పాల్పడ్డారు.

By :  Eha Tv
Update: 2024-07-23 09:16 GMT

ఆమె ఓ ఐఏఎస్‌ అధికారి భార్య.. సమాజంలో పేరున్న మహిళ. ఎందుకో తెలియదు కానీ చెడు మార్గాలలో పయనించారు. తనకు పరిచయమైన గ్యాంగస్టర్‌(Gangster)తో కలిసి నేరాలకు పాల్పడ్డారు. అరెస్ట్‌ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోంచి పారిపోయారు. ఇవన్నీ తెలుసుకున్న భర్త ఆమెతో బంధాన్ని తెంచుకోవాలనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఇంటికొచ్చారు. ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుజరాత్‌(Gujarat)లోని గాంధీనగర్‌(Gandhi Nagar)లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. గుజరాత్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి రణ్‌జీత్‌కుమార్‌( IAS Officer ranjith kumar's Wife Who Eloped With Gangster Returns Home, Dies By Suicide) రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయన భార్య సూర్య జైకి కొన్నాళ్ల కిందట తమిళనాడు(Tamilnadu)కు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం బంధంగా బలపడింది. తొమ్మిది నెలల కిందట గ్యాంగ్‌స్టర్‌తో కలిసి సూర్య జై ఇంట్లోంచి వెళ్లిపోయారు. తమిళనాడు ఇద్దరూ కలిసి నేరాలు చేయసాగారు. ఈ క్రమంలోనే జులై 11వ తేదీన ఓ బాలుడిని కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించారు. మదురై పోలీసులు(Madurai Police) వెంటనే అలెర్టయ్యి బాలుడిని కాపాడారు. అప్పట్నుంచి గ్యాంగ్‌స్టర్‌, సూర్య జై కోసం వెతుకుతున్నారు. ఇది తెలిసి సూర్య జై గత శనివారం గాంధీనగర్‌లోని తన భర్త రణ్‌జీత్‌కుమార్‌ ఇంటికి వచ్చారు. అయితే ఆమెను భర్త ఇంట్లోకి రానివ్వలేదు. దాంతో ఆమె విషం తాగి 108కి ఫోన్‌ చేశారు. సూర్యజైను స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్లు ఆమెను కాపాడలేకపోయారు. ఆదివారం రాత్రి ఆమె చనిపోయారు. రణ్‌జీత్‌కుమార్‌- సూర్య జై దంపతులు గత ఏడాది నుంచి విడివిడిగానే ఉంటున్నారని రణ్‌జీత్‌ తరఫు న్యాయవాది చెప్పారు. రణ్‌జీత్‌ విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారని తెలిపారు. గత శనివారం సూర్య జై ఇంటికి వచ్చారని, అయితే ఆమెను లోనికి అనుమతించొద్దని పనివాళ్లకు చెప్పి ఆయన విడాకుల కేసు పనిమీద బయటకు వెళ్లారని లాయర్‌ చెప్పారు. తిరిగొచ్చేసరికి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. కాగా.. ఆమె మృతదేహాన్ని తీసుకునేందుకు కూడా రణ్‌జీత్‌ కుమార్‌ నిరాకరించారట!ఐఏఎస్‌ భార్య.. చెడు మార్గాలు పట్టింది.. చివరకు ప్రాణాలు తీసుకుంది!

Tags:    

Similar News