Social Media Friendship: బ్యాంకు ఉద్యోగం ఇప్పిస్తానంటే నమ్మి వెళ్లిన మహిళ.. చివరికి

By :  Eha Tv
Update: 2024-06-17 03:48 GMT

సోషల్ మీడియాలో ఎవరో ఎక్కడ ఉంటారో తెలియకుండా స్నేహం చేసేస్తూ ఉంటాం. గుడ్డిగా నమ్మేస్తే ఊహించని దారుణాలు జరిగిపోయే అవకాశం ఉంది. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలోని ఓ హోటల్‌లో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు మత్తుమందు కలిపిన శీతల పానీయం ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మీరట్‌కు చెందిన బాధితురాలు తన ఫిర్యాదులో జరిగిన దారుణం గురించి తెలిపింది. తాను బ్యాంక్‌లో పని చేస్తున్నానని చెప్పుకునే వ్యక్తితో ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం చేశానని.. బ్యాంకులో ఉద్యోగం ఇప్పించేందుకు సాయం చేస్తానని మాయమాటలు కూడా చెప్పానని తెలిపింది.

నిందితుడు తన స్నేహితుడిని పంపి ఉద్యోగం ఇప్పిస్తానని.. తనతో పాటు డెహ్రాడూన్‌కు రావాలని మహిళను కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆమెను ఉత్తరప్రదేశ్‌లోని థానాభవన్‌కు రప్పించారు. అక్కడ ఆమె నిందితులను కలుసుకుంది. అక్కడ ఆమెకు మత్తుమందు కలిపిన శీతల పానీయం ఇచ్చారు. ఆ తర్వాత ఆమెను హోటల్‌కు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎలాగోలా బయట పడిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Tags:    

Similar News