Crime : చెన్నైలో దారుణం.. ఆరు నెలల కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ తండ్రి
తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణమైన, అవమానకరమైన ఘటన వెలుగు చూసింది
తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణమైన, అవమానకరమైన ఘటన వెలుగు చూసింది. పులియంతోప్‌లో తన ఆరు నెలల కుమార్తెను లైంగికంగా వేధించిన 45 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు చెన్నై పోలీసులు తెలిపారు. వ్యక్తిపై పోక్సో చట్టం ప్రయోగించారు. నిందితుడు తన భార్య, ఆరు నెలల కుమార్తెతో కలిసి పులియంతోప్‌లో నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. శుక్రవారం బాలిక తలకు గాయమైంది. దీంతో తల్లి బాలికను ఎగ్మోర్‌లోని ప్రభుత్వ చైల్డ్ హెల్త్ అండ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లింది.
వైద్యులు బాలికను పరీక్షించగా ఆమె ప్రైవేటు భాగాలపై గాయాలు కనిపించాయి. దీంతో వైద్యులు ఈ విషయాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులకు తెలిపారు. విచారణ అనంతరం అధికారులు పులియంతోప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్లు నేరం ఒప్పుకోవడానికి నిరాకరించాడని.. అయితే కఠిన విచారణ తర్వాత అతడు తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.