ఓరి మీ శాడిజం తగిలెయ్య.. మహిళను హత్యచేసి.. గొయ్యిలో పూడ్చి పెట్టి.. బొంద మీదనే పిండి వంటలు..
ఓరి మీ శాడిజం తగిలెయ్య.. మహిళను హత్యచేసి.. గొయ్యిలో పూడ్చి పెట్టి.. బొంద మీదనే పిండి వంటలు..
ఓ భర్త, అత్త, మామ, ఆడపడుచు చేసిన నిర్వాకం మామూలుగా లేదు. వివాహితను హతమార్చి గొయ్యి తీసి భర్త, అత్త, మామ, ఆడపడుచు పూడ్చి పెట్టారు. అంతేకాదు చుట్టుపక్కలవారికి అనుమానం రాకుండా ఏకంగా శవాన్ని పూడ్చిన బొందపైపూ కట్టెల పొయ్యి పెట్టి కుటుంబసభ్యులు పిండివంటలు చేసుకున్నారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ (Mahaboobabad Crime) పట్టణం సిగ్నల్ కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో వివాహితను హత మార్చి గొయ్యి తీసి పూడ్చి పెట్టిన భర్త, అత్త, మామ, ఆడపడుచు. వివాహిత అదృశ్యంపై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పాతిపెట్టిన చోట తవ్వగా మృతదేహం బయటపడింది. దీంతె ఇంటికి తాళం వేసి మృతురాలి భర్త, అత్త, మామ, ఆడపడుచు పరారయ్యారు. నిందితులుగా ఉన్న భర్త గోపి, అత్త లక్ష్మి, మామ కాటి రాములు, ఆడపడుచు దుర్గ, ఆడపడుచు భర్త మహేందర్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. చనిపోయిన మహిళ నాగమణి(35)కి ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లి కోల్పోయిన బాధలో పిల్లలు వర్ణనాతీతంగా రోదిస్తున్నారు.