YCP MP Daughter : ర్యాష్ డ్రైవింగ్ కార‌ణంగా వ్య‌క్తి మృతి.. వైసీపీ ఎంపీ కూతురు అరెస్ట్

వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురును చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు.

By :  Eha Tv
Update: 2024-06-19 03:09 GMT

వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురును చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీ కుమార్తె ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న సూర్య అనే యువకుడిపైకి కారు ఎక్కించ‌డంతో అత‌డు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు సూర్య భార్య వినిత ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేశారు. ఈ క్ర‌మంలోనే మాధురిని అరెస్ట్ చేశారు. అయితే వెంటనే స్టేషన్ బెయిల్ మీద ఆమె బయటకు వచ్చారు.

ఇక ప్రమాదం జరిగిన తర్వాత కారు ఆపిన మాధురి, ఆమె స్నేహితురాలు అంబులెన్స్‌కు కూడా ఫోన్ చేశారు. ఘ‌ట‌నాస్థ‌లం వ‌ద్ద స్థానికులు ప్రశ్నించడంతో మాధురి ఫ్రెండ్ వాదనకు దిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే వారు అంబులెన్స్ రాక ముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంబులెన్స్‌కు కాల్ చేసిన నంబర్ ఆధారంగా పోలీసులు మాధురిని కనుకొన్నారు. ఆ కారు పుదుచ్చేరి రిజిష్ట్రేషన్ పేరుతో ఉందని తెలిపారు. 

Tags:    

Similar News